Hanamkonda: హనుమకొండ జిల్లాలో విషాదం: విద్యుదాఘాతంతో పాలేరు మృతి!

Hanamkonda: హనుమకొండ పరకాల మండలం మలక్ పేటలో పొలంలో మోటార్ వేస్తుండగా విద్యుదాఘాతంతో పాలేరు రాసమల్ల కుమారస్వామి మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది.

M PRABHAKAR, PARAKAL
Published on: 15 Sept 2026 1:32 PM IST
Hanamkonda
X

Hanamkonda: హనుమకొండ జిల్లాలో విషాదం: విద్యుదాఘాతంతో పాలేరు మృతి!

Hanamkonda: పరకాల మండలం మలక్ పేట గ్రామానికి చెందిన రాసమల్ల కుమారస్వామి (45) విద్యుత్ షాక్ తో మృతి చెందిన ఘటన మలకపేట గ్రామంలోని హనుమాన్ దేవాలయం పక్కన జరిగింది.

స్థానికుల వివరాల ప్రకారం.. మలక్ పేటకు చెందిన కుమారస్వామి పిట్ట సమ్మయ్య భూ యజమాని వద్ద పాలేరుగా పనిచేస్తున్నాడు. రోజువారీ పనిలో భాగంగా మంగళవారం ఉదయం పొలంలో మోటార్ వేయడానికి వెళ్లగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు.

విషయాన్ని గమనించిన పిట్ట సమ్మయ్య భార్య గ్రామస్తులకు సమాచారం అందించారు. విషయం తెలియగానే కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. దీంతో అక్కడ విషాద వాతావరణం నెలకొంది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపడుతున్నారు.

మృతుడు కుమారస్వామికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. రజక సామాజిక వర్గానికి చెందిన ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందని, కుటుంబ పెద్దను కోల్పోవడంతో భార్య పిల్లల పరిస్థితి దయనీయంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం స్పందించి మృతుడి కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. పొలాల వద్ద విద్యుత్ ప్రమాదాల నివారణకు భద్రతా చర్యలు పటిష్టం చేయాలని విజ్ఞప్తి చేశారు.

M PRABHAKAR, PARAKAL

M PRABHAKAR, PARAKAL