Mahabubabad: జర్నలిస్టులకు రాఖీలు కట్టి హెల్మెట్లు పంపిణీ చేసిన సత్యవతి

Mahabubabad: రక్షాబంధన్ సందర్భంగా విలేకరులకు రాఖీలు కట్టి, హెల్మెట్లు పంపిణీ చేసిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని విజ్ఞప్తి.

A RAJKUMAR, MAHABOOBABAD
Published on: 28 Aug 2026 1:25 PM IST
Mahabubabad
X

Mahabubabad: జర్నలిస్టులకు రాఖీలు కట్టి హెల్మెట్లు పంపిణీ చేసిన సత్యవతి

Mahabubabad: హెల్మెట్ లు ధరించకపోవడం వల్ల ప్రమాదాలు జరిగినప్పుడు ఎంతో మంది మరణిస్తున్నారని, ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి ప్రమాదాల బారిన పడకుండా ఉండాలని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

రక్షా బంధన్ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రం లోని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ క్యాంపు కార్యాలయం లో పాత్రికేయులకు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ , మాజీ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బిందు లు.

రాఖీ లు కట్టి , హెల్మెట్ లు పంపిణీ చేశారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ, హెల్మెట్లు ధరించడం అందరు పాటించాలని , కొన్ని రోజులు ధరించి వదిలి వేస్తున్నారని, మహబూబాబాద్ జిల్లా ఎస్పీగా శబరిష్ బాధ్యతలు స్వీకరించాక హెల్మెట్ ధరించడం పై ప్రజల్లో అవగాహన కల్పించి అందరినీ చైతన్య వంతులను చేస్తున్నారని , నేను కూడా ప్రమాద బాధితురాలినని , రక్షా బంధన్ సందర్భంగా ప్రజలందరూ హెల్మెట్ల ధరించి కుటుంబ సభ్యులు వీధిన పడకుండా చూసుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఈ మీడియా సమావేశం లో పలువురు , బి.ఆర్.ఎస్ నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.

A RAJKUMAR, MAHABOOBABAD

A RAJKUMAR, MAHABOOBABAD

Next Story