Mulugu: ఏటూరునాగారంలో రోడ్డెక్కిన గిరిజన బాలికలు!
Mulugu: ములుగు జిల్లా ఏటూరునాగారం గిరిజన సంక్షేమ బాలికల హాస్టల్‌లో కనీస సౌకర్యాలు లేవంటూ రోడ్డెక్కిన విద్యార్థినులు. వార్డెన్‌పై సంచలన ఆరోపణలు, అధికారుల నిర్లక్ష్యం.
Mulugu: ఏటూరునాగారంలో రోడ్డెక్కిన గిరిజన బాలికలు!
Mulugu: ఏటూరునాగారం ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్‌లో సౌకర్యాల కొరత. సమస్యలపై రోడ్డెక్కిన గిరిజన బాలికలు, తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న విద్యార్థినులు. స్నానానికి ఉపయోగించే నీటినే తాగాల్సిన దుస్థితి.
టిఫిన్‌లో పురుగులు వస్తున్నాయని విద్యార్థినుల ఆరోపణ, అధ్వానంగా వాష్‌రూమ్‌లు తీవ్ర అవస్థలు, వార్డెన్‌పై సంచలన ఆరోపణలు చేసిన విద్యార్థినులు.
సమస్యలు చెబితే బూతులు తిడుతూ, కొడుతున్నారని ఆరోపణ, విద్యార్థినుల కన్నీళ్లతో బయటపడ్డ హాస్టల్ దుస్థితి. విద్యార్థినుల సంక్షేమం, భద్రతపై అధికారుల నిర్లక్ష్యమా?
మంత్రి సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలోనే దుస్థితిపై ఆగ్రహం. హాస్టల్‌పై అధికారుల పర్యవేక్షణ ఎక్కడ? అంటూ ప్రశ్నలు.
విద్యార్థినుల ఆరోగ్యం, భద్రతతో చెలగాటం ఆడుతున్నారంటూ ఆవేదన, వెంటనే సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్.




