Parvathagiri: ఎండిన పంటలను పరిశీలించి రైతులకు ధైర్యం చెప్పిన ఎర్రబెల్లి!

Parvathagiri: పర్వతగిరి మండలం సిత్య తండాలో ఎస్సారెస్పీ కాలువ నీరు అందక ఎండిపోయిన పంట పొలాలను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరిశీలించారు.

Narender, Staff Reporter  -Warangal
Published on: 17 Aug 2026 10:43 AM IST
Parvathagiri
X

Parvathagiri: ఎండిన పంటలను పరిశీలించి రైతులకు ధైర్యం చెప్పిన ఎర్రబెల్లి!

Parvathagiri: పాలకుర్తి నియోజకవర్గ పర్యటనకు వెళ్తున్న సందర్భంలో వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం సిత్య తండాలో SRSP కాలువ నుండి నీటి విడుదల చేయక ఎండిపోయిన పంట పొలాలను రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరిశీలించారు.

ఈ సందర్భంగా అక్కడే వ్యవసాయ పనులు చేసుకుంటూ ఉన్న రైతు రమావత్ భిక్ష పొలంలో బోరును, పక్కనే అనుకొని ఉన్న చెక్ డ్యామ్ ను పరిశీలించి సాగు నీరు అందక ఎండిపోయిన నారు మడిని చూసి మాజీ మంత్రి ఎర్రబెల్లి అవేదనకు గురయ్యారు.

గత పది ఏండ్ల పాలనలో ఈ సంవత్సరం రైతులకు వచ్చిన దుస్థితి ఎన్నడూ రాలేదని రైతులు రమావత్ భిక్ష, కిషన్ అన్నారు. గత కెసిఆర్ ప్రభుత్వ హయాంలో రైతులను సంతోషంగా ఉన్నామని సంవత్సరంలో మూడు పంటలు పండించే వాళ్లమని ఎర్రబెల్లికి రైతులు తెలిపారు.

ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ సమయానికి రైతు బంధు, ఎరువులు, కరెంట్, సాగు నీరు అందించి మమ్మల్ని కంటికి రెప్పోలే కాపాడుకున్నారని అన్నారు, కానీ ఈ కాంగ్రెస్ రేవంత్ సర్కార్ లో మాత్రం రైతులకు కన్నీరే మిగిలిందని అన్నారు.

ఇప్పటికైనా రేవంత్ రెడ్డి కళ్లు తెరిచి నష్టపోతున్న రైతుల గురించి ఆలోచించి SRSP కాలువ ద్వారా సాగునీరు విడుదల చేసి రైతులకు అండగా నిలబడాలని కోరారు.ఈ కార్యక్రమంలో పర్వతగిరి మండల బిఆర్ఎస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story