Hananamkonda: 5 జిల్లాల కలెక్టర్లతో హరి చందన దాసరి సమీక్ష!

Hananamkonda: హనుమకొండ ఐడీఓసీలో ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ–2026పై ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ హరి చందన దాసరి ఐఏఎస్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

Narender, Staff Reporter  -Warangal
Published on: 18 July 2026 3:41 PM IST
Hananamkonda
X

Hananamkonda: 5 జిల్లాల కలెక్టర్లతో హరి చందన దాసరి సమీక్ష!

Hananamkonda: ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ–2026 (Special Intensive Revision–2026) కార్యక్రమం అమలుపై ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్, తెలంగాణ రాష్ట్ర స్కిల్, హ్యూమన్ క్యాపిటల్ అండ్ నాలెడ్జ్ ట్రైనింగ్ ఇనిషియేటివ్స్ (SHAKTI) శాఖ కార్యదర్శి శ్రీమతి హరి చందన దాసరి, ఐఏఎస్ శనివారం హనుమకొండ కలెక్టరేట్‌లోని ఐడీఓసీ సమావేశ మందిరంలో హనుమకొండ, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ కార్యక్రమం పురోగతిని జిల్లా వారీగా సమీక్షించారు.

ఈ సమావేశంలో హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, వరంగల్ జిల్లా కలెక్టర్ డా. సత్య శారద, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్, ములుగు జిల్లా అదనపు కలెక్టర్ మహేందర్ జి, సంబంధిత జిల్లాల అదనపు కలెక్టర్లు, ఎన్నికల విభాగ అధికారులు, రిటర్నింగ్ అధికారులు, సహాయ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల విభాగ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story