Dr Chandrasekhar: అమిత్ షా యూత్ బ్రిగేడ్ జాతీయ ఉపాధ్యక్షుడిగా డా. చంద్రశేఖర్!

Dr Chandrasekhar: అమిత్ షా యూత్ బ్రిగేడ్ జాతీయ ఉపాధ్యక్షుడిగా డాక్టర్ చంద్రశేఖర్ ఎలిగాటి నియమితులయ్యారు.

Narender, Staff Reporter  -Warangal
Published on: 8 Sept 2026 6:15 PM IST
Dr Chandrasekhar
X

Dr Chandrasekhar: అమిత్ షా యూత్ బ్రిగేడ్ జాతీయ ఉపాధ్యక్షుడిగా డా. చంద్రశేఖర్!

Dr Chandrasekhar: అమిత్ షా యూత్ బ్రిగేడ్ సంస్థ జాతీయ ఉపాధ్యక్షుడిగా డాక్టర్ చంద్రశేఖర్ ఎలిగాటి నియమితులయ్యారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదర్శాలు, విధానాలు, భావజాలం దేశ ప్రజలందరికీ చేరేలా కృషి చేయడమే ధ్యేయంగా ఈ సంస్థ విశేషంగా కృషి చేస్తోంది. ఆ క్రమంలో తెలంగాణలో విస్తరించే ప్రణాళికలు ముమ్మరం చేసింది. జాతీయ ఉపాధ్యక్షుడిగా డాక్టర్ చంద్రశేఖర్ తెలంగాణలో ఈ సంస్థను మరింత జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని జాతీయ నాయకత్వం సూచించింది.

దేశ పౌరులంతా సమగ్రత, ఐక్యత, సార్వభౌమాధికారాన్ని కాపాడాలని డా. చంద్రశేఖర్ ఎలిగాటి పిలుపునిచ్చారు. దేశ నిర్మాణంలో యువత పాత్ర చాలా కీలకమని ఆయన పేర్కొన్నారు. ఆ క్రమంలో అమిత్ షా ఆదర్శాలు తెలంగాణ వ్యాప్తంగా ప్రచారం చేయడం తమ లక్ష్యమని ఆయన అన్నారు. వీటితో పాటు డా. చంద్రశేఖర్ మానవ హక్కుల కోసం విశేష కృషి చేశారు.

మరోవైపు భారతీయ జన్ కళ్యాణ్ మంచ్ సంస్థ తెలంగాణ విభాగానికి పలు కీలక నియామకాలు చేపట్టింది. ఎలిగాటి లావణ్యను తెలంగాణ మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు. ఇక ఆ సంస్థ సంస్థాగత మంత్రిగా డాక్టర్ ఎలిగాటి చంద్రశేఖర్ నియమితులయ్యారు. ఈ మేరకు భారతీయ జన్ కళ్యాణ్ మంచ్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ దర్శన్ ఆర్ షా ప్రకటించారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story