Mahabubabad: డబుల్ ఇంజన్ సర్కార్‌తోనే అభివృద్ధి.. మాజీ ఎంపీ సీతారామ్ నాయక్
Mahabubabad: మహబూబాబాద్‌లో మాజీ ఎంపీ సీతారామ్ నాయక్ వ్యాఖ్యలు. కాంగ్రెస్ కంటే మోదీ పాలనలోనే ఎక్కువ అభివృద్ధి జరిగిందని వెల్లడి.
Mahabubabad: డబుల్ ఇంజన్ సర్కార్‌తోనే అభివృద్ధి.. మాజీ ఎంపీ సీతారామ్ నాయక్
Mahabubabad: డబుల్ ఇంజన్ సర్కార్ తోనే రాష్ట్రం లో అభివృద్ధి సాధ్యమని మాజీ ఎంపీ.. బిజెపి నాయకుడు ప్రొఫెసర్ సీతారామ్ నాయక్ అన్నారు. కేంద్రం లో మోదీ ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రం లోని బీజేపీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో ఆయన మాట్లాడుతూ.. భారత దేశం లో కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన 65 సంవత్సరాల కాలంలో కన్నా, మోదీ 12 సంవత్సరాల పాలనా కాలంలో ఎంతో అభివృద్ధి చెందిందని, ఎన్నో నూతన సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి దేశవ్యాప్తంగా అమలు చేస్తోందని, 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అధికారంలో ఉందని గుర్తు చేశారు.
తెలంగాణ రాష్ట్రం లో బిజెపి అధికారంలో లేకున్నా వేల కిలోమీటర్ల జాతీయ రహదారులు, గ్రీన్ ఫీల్డ్ హైవే లు, బీబీనగర్ లో ఎయిమ్స్, రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ పునరుద్ధరణ, కాజీపేట లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఎయిర్ పోర్టు లు, పాస్ పోర్టు కార్యాలయాలు, వరంగల్ లో టెక్స్ టైల్ పార్క్, నూతన రైల్వే మార్గాలను ఏర్పాటు చేసిందన్నారు. ఈ మీడియా సమావేశంలో జిల్లా బిజెపి అధ్యక్షుడు వల్లపు వెంకటేశ్వర్లు, బిజెపి నాయకులు రాంచందర్ రావు, బిజెపి శ్రేణులు పాల్గొన్నారు.




