Dornakal: యాదవ నగర్‌లో వైభవంగా వినాయక చవితి వేడుకలు

Dornakal: డోర్నకల్ యాదవ నగర్‌లో వైభవంగా వినాయక చవితి వేడుకలు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న గంగపుత్ర సంఘం అధ్యక్షుడు పెద్దపల్లి దిలీప్, యువకులు.

P PRABHAKAR, DORNAKAL
Published on: 14 Sept 2026 7:53 PM IST
Dornakal
X

Dornakal: యాదవ నగర్‌లో వైభవంగా వినాయక చవితి వేడుకలు

డోర్నకల్: డోర్నకల్ మున్సిపల్ కేంద్రంలోని యాదవ నగర్‌లో వినాయక చవితి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. విగ్రహ దాత డోర్నకల్ మండల గంగపుత్ర సంఘం అధ్యక్షుడు పెద్దపల్లి దిలీప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి,భక్తిశ్రద్ధలతో గణనాథుడిని కొలిచారు.

అనంతరం భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వినాయక చవితి సందర్భంగా యాదవ నగర్‌లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.ఈ సందర్బంగా పెద్దపల్లి దిలీప్ మాట్లాడుతూ గణనాథుడి ఆశీస్సులతో డోర్నకల్ పట్టణ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.

ప్రతి కుటుంబంలో ఆనందం, శాంతి, ఐశ్వర్యం వెల్లివిరియాలని కోరుకున్నారు. వినాయక చవితి పర్వదినాన్ని ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని వారు పిలుపునిచ్చారు. అనంతరం భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తూ, గణనాథుని ఆశీస్సులు పొందారు.ఈ కార్యక్రమంలో విగ్నేశ్వర యూత్ కమిటీ సభ్యులు రేపాకుల పవన్, రేపాకుల ఉదయ్,రావులపల్లి సంత్ ,కాసు భాగ్యరాజ్,కొమ్ము కార్తీక్ తదితరులు ఉన్నారు

P PRABHAKAR, DORNAKAL

P PRABHAKAR, DORNAKAL