Mahabubabad: రైతుల బ్యాంకు ఖాతాలకు జమ అయిన ఉద్యాన సబ్సిడీ నిధులు

Mahabubabad: జిల్లాలో ఆయిల్ పామ్, ఉద్యాన పంటలు సాగు చేస్తున్న రైతుల ఖాతాలకు డీబీటీ ద్వారా రూ.2.11 కోట్లు జమ చేసినట్లు ఉద్యాన శాఖ అధికారి జినుగు మరియన్న తెలిపారు.

A.Rajkumar, Mahabubabad
Published on: 27 Aug 2026 4:44 PM IST
Mahabubabad
X

Mahabubabad: రైతుల బ్యాంకు ఖాతాలకు జమ అయిన ఉద్యాన సబ్సిడీ నిధులు

మహబూబాబాద్: గ్రామ గ్రామ న ప్రచార కార్యక్రమాలు మిషన్ వైవిధ్యం - పంట మార్పిడి వరి సాగు వద్దు - సాఫ్ట్వేర్ ఇంజినీర్స్, డాక్టర్స్, ఉద్యోగుల జీతం వలె అధిక ఆదాయం ఇచ్చే ఆయిల్ పామ్, మల్బరీ, కూరగాయలు, అన్ని ఉద్యాన పంటల సాగు ముద్దు.

ఆయిల్ పామ్, పండ్ల తోటలు సాగు చేసే రైతుల బ్యాంకు ఖాతాలకు జిల్లా ఖజానా శాఖ నుండి DBT ద్వారా ఆయిల్ పామ్ సాగు పథకం, సమగ్ర ఉద్యాన మిషన్ పథకం కింద తోటల యాజమాన్యానికి ఈ ఆర్థిక సంవత్సరంనకు నిధులు మంజూరు అయి, సదరు రైతుల బ్యాంకు ఖాతా కు జమ అయినవని జిల్లా ఉద్యానవన మరియు పట్టు పరిశ్రమ శాఖ అధికారి జినుగు మరియన్న నేడు ఒక ప్రకటనలో తెలిపారు.

ఆయిల్ పామ్ పథకానికి 3699 ఎకరాలకు, 981 మంది రైతులకు 1,55,37,585 రూపాయలు మరియు సమగ్ర ఉద్యాన మిషన్ పథకానికీ 185 ఎకరాలకు, 314 మంది రైతులకు Rs.55,64,841 రూపాయలు నేరుగా (మొత్తం కలిపి 2,11,02,426 రూపాయలు , 3884 ఎకరాలు, 1295 మంది రైతులు) రైతులకు నేరుగా వారివారి బ్యాంకు ఖాతాల కు జమచేయడం జరిగిందని అన్నారు.

ఎల్ నినో పరిస్థితుల్లో వర్షాబావ పరిస్థితులలో రైతులు స్థిరమైన ఆదాయం ఇచ్చే ఆయిల్ పామ్, మల్బరీ, కూరగాయలు, పండ్లు, పూలు,ఉల్లి, మునగ, ఆకు కూరలు, మొదలైన మార్కెట్ డిమాండ్ ఉన్న పంటల ను "వరి, మొక్కజొన్న, పత్తి, మిరప" బదులుగా బోర్లు, బావులు కింద సాగు చేయాలని రైతులకు విజ్ఞప్తి చేశారు.

A.Rajkumar, Mahabubabad

A.Rajkumar, Mahabubabad

Next Story