Atmakur: ప్రతీ గ్రామం పచ్చదనం పరిశుభ్రంగా ఉండాలి కలెక్టర్ చాహత్ బాజ్ పాయి
Atmakur: ఆత్మకూరు మండలంలో జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి విస్తృత పర్యటన. గ్రామాల పరిశుభ్రత, అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలల అభ్యసన సామర్థ్యాల పరిశీలన.
Atmakur: ప్రతీ గ్రామం పచ్చదనం పరిశుభ్రంగా ఉండాలి కలెక్టర్ చాహత్ బాజ్ పాయి
Atmakur: ఆత్మకూరు మండలం లో జిల్లా కలెక్టర్ పర్యటన. ప్రతీ గ్రామం పచ్చదనం, పరిశుభ్రంగా ఉండాలని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అన్నారు. గురువారం కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్. ఆత్మకూరు మండలంలో పర్యటించారు. ముందుగా కొత్తగట్టు గ్రామం లో సెగ్రీగెషన్ షెడ్ ద్వారా చేస్తున్న సేంద్రియ ఎరువు తయారీ ని పరిశీలించారు.
ఇప్పటివరకు తయారైన ఎరువును విక్రాయించారా లేదా అని, అలాగే దాని ద్వారా వచ్చిన ఆదాయన్ని గురించి కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు అనంతరం అంగన్వాడీ కేంద్రంను సందర్శించి అక్కడ వంట తయారీని పరిశీలించారు.
పిల్లలు ఎంత మంది హాజరయ్యారని అడిగి తెలుసుకొని అక్కడ ఉన్న పిల్లలను వివిధ రకాల పండ్ల పేర్లను అడిగి కేంద్రం లో వారికి నేర్పిస్తున్న బోధనా విధానాన్ని కలెక్టర్ పరిశీలించారు. చిన్నప్పటి నుంచే పిల్లలకి నేర్చుకోవాలన్న తపన కలగాలి అంటే.. అంగన్వాడీ కేంద్రం లో టీచర్లు ఆసక్తి కలిగేలా వివిధ రకాల ఆటపాటలతో కూడిన పాఠ్యాంశాలను బోధించాలన్నారు.
ప్రాథమిక పాఠశాలలోని 3వ తరగతిని సందర్శించి గణితం లోని కొన్ని లెక్కలను ఇచ్చి వాటిని ఆ విద్యార్థులు ఏవిధంగా చేస్తారు అని వారి అభ్యసన సామర్ధ్యాన్ని కలెక్టర్ పరిశీలించారు.
అనంతరం పాఠశాల పరిసరాలను పరిశీలించి టాయిలెట్స్ ని ప్రతీరోజు శుభ్రం గా ఉండేలా చూసుకోవాలన్నారు. నీటి వసతి, ఆర్వో ప్లాంట్ పని తీరును కుడా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అదే గ్రామం లో నిర్మించిన ఫామ్ పౌండ్ ను కలెక్టర్ పరిశీలించారు. గ్రామానికి చెందిన వీరబోయిన అశోక్ తన స్థలం లో నిర్మించ తలపెట్టిన ఫామ్ పౌండ్ కి భూమి పూజ చేశారు.
అనంతరం కలెక్టర్ గ్రామం లో కలియ తిరిగి సోక్ పిట్స్, టాయిలెట్స్ ఉన్నాయా లెవా అని, అలాగే గ్రామం లో నిర్మాణం పూర్తయిన ఇందిరమ్మ ఇళ్ల వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ప్రతీ ఇంటికి సోక్ పిట్, టాయిలెట్ ఉండాలని అలాగే ప్లాస్టిక్ వాడకాన్ని నిషేదించాలని కలెక్టర్ గ్రామస్తులకు తెలిపారు.
వన మహోత్సవం లో భాగం గా అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులతో కలిసి కలెక్టర్ మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీజ, డిఆర్డీఓ మేన శ్రీను, డిపిఓ లక్ష్మీ రమాకాంత్, ఎంపీడీఓ శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.




