Warangal: సంచార జాతుల సంక్షేమానికి పెద్దపీట: కలెక్టర్ సత్య శారద!
Warangal: వరంగల్ కలెక్టరేట్‌లో బీసీ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో సంచార జాతుల విముక్తి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
Warangal: సంచార జాతుల సంక్షేమానికి పెద్దపీట: కలెక్టర్ సత్య శారద!
వరంగల్ జిల్లా, ఆగస్టు 31: వరంగల్ జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో సోమవారం సంచార జాతుల విముక్తి దినోత్సవాన్ని బి సి వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పాల్గొని మహాత్మా జ్యోతిరావు ఫూలే, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
బ్రిటిష్ పాలనలో క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ కింద అనేక సంచార, అర్ధసంచార జాతులు అణచివేతకు గురయ్యాయని అధికారులు తెలిపారు. అనంతరం ఈ జాతులను ఆ చట్టం నుంచి విముక్తి చేసి *డీ-నోటిఫైడ్ ట్రైబ్స్ (విముక్తి జాతులు)*గా గుర్తించిన నేపథ్యంలో ప్రతి సంవత్సరం ఆగస్టు 31న విముక్తి జాతుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
సంచార, అర్ధసంచార, విముక్తి జాతుల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. విద్య, ఉపాధి, గృహ వసతి, సామాజిక భద్రత వంటి రంగాల్లో వారికి అందుతున్న ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ జి సంధ్యారాణి, అదనపు కలెక్టర్ లోకల్ బాడీ వైవి గణేష్, జిల్లా బీసీ అభివృద్ధి అధికారి పుష్ప లత, సంబంధిత శాఖల అధికారులు, వివిధ జాతుల కుల సంఘాల నాయకులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




