Warangal: శ్రావణమాసం తొలి పూజ – ఉమామహేశ్వర స్వామి ఆలయంలో డీసీపీ!

Warangal: శ్రావణమాసం సందర్భంగా ఉమామహేశ్వర స్వామి ఆలయంలో డీసీపీ రాజా మహేంద్ర నాయక్ ప్రత్యేక పూజలు. అభిషేకం, అర్చనల్లో పాల్గొన్న డీసీపీ, ఏసీపీ నరసయ్య.

MD AHMAD PASHA, JANGAON
Published on: 13 Aug 2026 3:27 PM IST
Warangal
X

Warangal: శ్రావణమాసం తొలి పూజ – ఉమామహేశ్వర స్వామి ఆలయంలో డీసీపీ!

Warangal: శ్రావణమాసం సందర్భంగా శ్రీ ఉమామహేశ్వర దేవాలయంలో డీసీపీ రాజా మహేంద్ర నాయక్ ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు సాంబమూర్తి శర్మ ఆధ్వర్యంలో డీసీపీ రాజా మహేంద్ర నాయక్ చేతుల మీదుగా ఉమామహేశ్వర స్వామివారి లింగానికి అభిషేకం పుష్పార్చన నిర్వహించి ప్రత్యేక హారతి ఇచ్చారు.

అనంతరం అర్చకులు సాంబమూర్తి శర్మ డీసీపీ రాజా మహేంద్ర నాయక్‌ గారికి శ్రీ ఉమామహేశ్వర స్వామివారి ఆశీస్సులు అందించి తీర్థ,ప్రసాదాలు అందజేశారు. శ్రావణమాసంలో స్వామివారి దర్శనం చేసుకోవడం ఆనందంగా ఉందని డీసీపీ పేర్కొన్నారు ఈ పూజ కార్యక్రమంలో వర్ధన్నపేట ఏసీపీ అంబాటి నరసయ్య పాల్గొన్నారు.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON

Next Story