Jangaon: కలెక్టరేట్ (IDOC) లో సైబర్ నేరాలపై ప్రత్యేక అవగాహన సదస్సు!
Jangaon: పోలీస్ కమిషనర్ స్వేత ఐపీఎస్ ఆదేశాల మేరకు జనగామ ఐడీఓసీ కాంప్లెక్స్‌లో ప్రభుత్వ అధికారులకు, సిబ్బందికి సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
Jangaon: కలెక్టరేట్ (IDOC) లో సైబర్ నేరాలపై ప్రత్యేక అవగాహన సదస్సు!
జనగామ: వరంగల్ పోలీస్ కమిషనర్ శ్రీమతి స్వేత ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు జనగామ పర్యవేక్షణలో ఏసీపీ శ్రీ భీమ్ శర్మ సీఐ శ్రీ సత్యనారాయణ రెడ్డి సైబర్ క్రైమ్ ఎస్‌ఐ మరియు పోలీసు సిబ్బందితో కలిసి నేడు జనగామలోని ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీసెస్ కాంప్లెక్స్ IDOCలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు
ఈ కార్యక్రమంలో ఐడీఓసీకి చెందిన అన్ని శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు సైబర్ నేరగాళ్లు అనుసరిస్తున్న డిజిటల్ అరెస్ట్ ఓటీపీ బ్యాంకింగ్ మోసాలు ఫిషింగ్ లింకులు నకిలీ పెట్టుబడి పథకాలు సోషల్ మీడియా మోసాలు తదితర సైబర్ నేరాల గురించి వివరించి, వాటి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు.
అలాగే సైబర్ మోసాలకు గురైన వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని లేదా జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు నమోదు చేయాలని సూచించారు సైబర్ నేరాల నివారణలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ప్రజల్లో కూడా సైబర్ భద్రతపై అవగాహన కల్పించాలని అధికారులు కోరారు.




