Jangaon: జనగామలో సీపీఎం ఆధ్వర్యంలో సాయుధ పోరాట వారోత్సవ కరపత్రం ఆవిష్కరణ!

Jangaon: జనగామలో సెప్టెంబర్ 17న సాయుధ పోరాట వారోత్సవాల బహిరంగ సభ.. కరపత్రం ఆవిష్కరించిన సీపీఎం నాయకులు, భారీగా తరలిరావాలని పిలుపు.

S MAHENDER, PALAKURTHI
Published on: 16 Sept 2026 2:24 PM IST
Jangaon
X

Jangaon: జనగామలో సీపీఎం ఆధ్వర్యంలో సాయుధ పోరాట వారోత్సవ కరపత్రం ఆవిష్కరణ!

Jangaon: వీర తెలంగాణ సాయుధ పోరాట యోధులను అవమానపరిచే మతోన్మాద వక్రీకరణ శక్తుల కుట్రలను తిప్పికొట్టాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చిట్యాల సోమన్న మండల కార్యదర్శి మాచర్ల సారయ్య పిలుపునిచ్చారు.

బుధవారం పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో వీరనారి ఐలమ్మ చౌరస్తాలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల బహిరంగ సభ కరపత్రాన్ని సిపిఎం ఆధ్వర్యంలో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా వారు పాల్గొని మాట్లాడుతూ భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం సాగిన రైతాంగ సాయుధ పోరాటంలో అమరులైన వీరుల వారసత్వాన్ని సిపిఎం పార్టీ ప్రజా ఉద్యమాల ద్వారా కొనసాగిస్తుందని అన్నారు. నిజాం నిరంకుశ పాలనను ఎదిరించి రజాకార్లను ఎదుర్కొని దోపిడి దారుల బానిసత్వాన్ని చెరిపేసిన వీరులు తెలంగాణకు గర్వకారణం అని గుర్తు చేశారు.

సాయిధ పోరాటంలో 4000 మంది అమరులై 10 లక్షల ఎకరాల భూమి పంచిన చరిత్ర ఎర్రజెండదేనని వారు తెలిపారు, నేటికీ దేశంలో పేదరికం తిండి గూడు లేని ప్రజలు అనేకంగా ఉన్నారని పేదల రాజ్యం రావాలంటే ఎర్రజెండా అధికారంలోకి వస్తేనే సాధ్యపడుతుందన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అసువులు బాసిన అమరవీరుల ఆశయాలను కొనసాగించాలని కష్టజీవుల రాజ్యమే ఎర్రజెండా రాజ్యమని సిపిఎం పోరాటంలో ప్రజలు ఐక్యంగా ముందుండాలని పిలుపునిచ్చారు.

ఈనెల 17న జిల్లా కేంద్రంలో జరిగే భారీ బహిరంగ సభకు సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ తమ్మినేని వీరభద్రం గారు, హాజరవుతున్నట్లు తెలిపారు, బహిరంగ సభకు సిపిఎం శ్రేణులు ప్రజలు వ్యవసాయ కూలీలు రైతులు కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు,ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు సోమసత్యం, మాసంపల్లి నాగయ్య, ఏదునూరి మదార్, ముస్కు ఇంద్రారెడ్డి, నాయకులు మల్పరాజు నరేష్, కే బాబు, తోటరాజు, కే పద్మ, యాకలక్ష్మి, మైసమ్మ, సోమలక్ష్మి, గౌతమి, ఇద్దామా, సోమక్క, లచ్చమ్మ, బుచ్చమ్మ, మాధవి, చంద్రమ్మ, బాలమ్మ, స్వరూప, చిన్న సోమయ్య తదితరులు పాల్గొన్నారు.

S MAHENDER, PALAKURTHI

S MAHENDER, PALAKURTHI