Mahabubabad: బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలపై సీపీఎం సమరశంఖం!
Mahabubabad: మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో సీపీఎం, సీఐటీయూ ఆధ్వర్యంలో 'జైల్ భరో' కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించారు.
Mahabubabad: బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలపై సీపీఎం సమరశంఖం!
మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కేంద్ర లో జైల్ భరో విజయవంతం లో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కుంట ఉపేందర్ మాట్లాడుతూ... దేశవ్యాప్తం బిజేపి ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూల, కార్మిక,రైతు,ప్రజా వ్యతిరేక విధానాలను వేగంగా అమలు చేస్తూ, స్వాతంత్ర్యాన్ని విదేశీ సంస్థలకు తాకట్టు పెడుతున్నదని, క్విట్ ఇండియా ఉద్యమ స్పూర్తితో దేశాన్ని కాపాడుకోవాలని అన్నారు.
దేశవ్యాప్తంగా కార్మికులు కర్షకులు, వ్యవసాయ కూలీలు చేపట్టిన జైల్ భరో కార్యక్రమం మండలంలో విజయవంతం మయింది. ముందుగా రైతులు, వ్యవసాయ కార్మికులు సిఐటియు అనుబంధ సంఘాలైన హమాలి, గ్రామ పంచాయితి, ఆశా, అంగన్వాడి వర్కర్లు, ఆటో, ట్రాక్టర్ డ్రైవర్లు, స్ట్రీట్ వెండర్లు తదితర రంగాల నాయకులు కార్యకర్తలు,
సిపిఎం శ్రేణులు స్థానిక వెజేళ్ళ సైదులు రావు భవనం నుండి భారీ ప్రదర్శనగా బయలు దేరి బస్ స్టాండ్ సెంటర్ కు చేరుకొని అనంతరం రాస్తారోకో నిర్వహించారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మండా రాజన్న, మండల కార్యదర్శి వల్లాల వెంకన్న, సిఐటియు మండల కో కన్వీనర్ అంగిరేకుల నాగేశ్వరరావు లు మాట్లాడుతూ.. కేంద్రం లోని బిజెపి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను నిశితంగా వివరించారు.
అనేక పోరాటాల ఫలితంగా కార్మికులు సాధించుకున్న చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడులు గా చేసి కార్మికులను కట్టు బానిసలుగా మార్చుతున్నారని ఆరోపించారు. వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసే నిర్ణయాలు తీసుకుంటుందని, ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి వ్యవసాయ కార్మికులకు నష్టదాయకమైన విబిజీరాంజీ పథకాన్ని ప్రవేశపెట్టిందని విమర్శించారు. పత్తి, మొక్కజొన్న వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతి ఒప్పందాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
కనీస మద్దతు ధర చట్టాన్ని చేయాలని కోరారు. జైల్ భరో కార్యక్రమాన్ని చూసైనా పాలకులు బుద్ధి తెచ్చుకోవాలని లేని యెడల మరిన్ని పోరాటాలకు సిద్ధం అవుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు చంటి,ఆనందరావు, మోహన్, పురుషోత్తం, మల్లికాంబ,చంద్రకళ, శకుంతల, లలిత, రేణుక, దేవదానం, భిక్షం, శ్రీను, వీరన్న తదితరులు పాల్గొన్నారు. అనంతరం రాస్తారోకో చేస్తున్న నాయకులను బలవంతంగా అరెస్టు చేశారు.




