Hanumakonda: హనుమకొండలో కాంగ్రెస్ BLA శిక్షణ.. హాజరైన మీనాక్షి నటరాజన్!
Hanumakonda: హనుమకొండలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బూత్ లెవల్ ఏజెంట్ల (BLA) శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
Hanumakonda: హనుమకొండలో కాంగ్రెస్ BLA శిక్షణ.. హాజరైన మీనాక్షి నటరాజన్!
Hanumakonda: వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన బూత్ లెవల్ ఏజెంట్ల (BLA) శిక్షణ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం నుంచి కీలక నేతలు హాజరయ్యారు.
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం (SIR)పై పార్టీ శ్రేణులకు అవగాహన కల్పించేందుకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ , తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు బూత్ స్థాయిలో పార్టీ బలోపేతం, ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో BLAల పాత్ర, ప్రతి అర్హుడైన ఓటరు పేరు జాబితాలో ఉండేలా తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. SIR ప్రక్రియను సమర్థవంతంగా అమలు చేసి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
ఈ కార్యక్రమం లో ఎమ్మెల్యే లు నాయిని రాజేందర్ రెడ్డి, కే. ఆర్ నాగరాజు, ఎంపీ కడియం కావ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.




