Maripeda: కాంగ్రెస్ హామీల అమలులో ప్రభుత్వం విఫలం.. మాజీ ఎమ్మెల్యే!

Maripeda: కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు, 420 హామీల అమలులో విఫలమైందని మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యా నాయక్ విమర్శ. మరిపెడలో బీఆర్ఎస్ ముఖ్య నాయకుల సమావేశం.

P PRABHAKAR, DORNAKAL
Published on: 15 Sept 2026 4:26 PM IST
Maripeda
X

Maripeda: కాంగ్రెస్ హామీల అమలులో ప్రభుత్వం విఫలం.. మాజీ ఎమ్మెల్యే!

Maripeda: కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని డోర్నకల్‌ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే డీఎస్‌ రెడ్యా నాయక్‌ విమర్శించారు. హామీల అమలుపై ప్రజలకు ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

మరిపెడ మండల కేంద్రంలోని నవీన్‌ సార్‌ గెస్ట్‌హౌస్‌లో డోర్నకల్‌ నియోజకవర్గంలోని వివిధ మండలాల ముఖ్య నాయకులతో డీఎస్‌ రెడ్యా నాయక్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలు, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు తదితర అంశాలపై నాయకులతో సుదీర్ఘంగా చర్చించారు.

ప్రజా సమస్యలపై పోరాటం చేయాలి

సమావేశంలో రైతులు, మహిళలు, యువత, నిరుద్యోగులు, ఉద్యోగులు, పేదలు ఎదుర్కొంటున్న సమస్యలను నాయకులు మాజీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. నియోజకవర్గంలోని ప్రతి మండలంలో ప్రజా సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేయాలని డీఎస్‌ రెడ్యా నాయక్‌ సూచించారు.

బీఆర్‌ఎస్‌ శ్రేణులు ప్రజలకు అందుబాటులో ఉంటూ, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, వాటి అమలుపై ప్రజల్లో అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గవ్యాప్తంగా పార్టీని మరింత బలోపేతం చేసి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం సమిష్టిగా పనిచేయాలని సూచించారు. సమావేశంలో డోర్నకల్‌ నియోజకవర్గంలోని వివిధ మండలాల ముఖ్య నాయకులు, బీఆర్‌ఎస్‌ శ్రేణులు పాల్గొన్నారు.

P PRABHAKAR, DORNAKAL

P PRABHAKAR, DORNAKAL