Jangaon District: జనగామలో ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి: కలెక్టర్

Jangaon District: జనగామలో ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేసి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు.

MD AHMAD PASHA, JANGAON
Published on: 29 April 2026 12:43 PM IST
Jangaon District
X

Jangaon District

Jangaon District: జనగామ జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు.

రఘునాథ్‌పల్లి మండలం కోమల్ల గ్రామంలో ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కొనుగోలు, రవాణా ప్రక్రియలను వేగవంతంగా నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు.

టోకెన్ పద్ధతి ద్వారా వచ్చిన ధాన్యాన్ని అదే రోజు తేమ శాతం పరిశీలించి వెంటనే కొనుగోలు చేయాలని, అనంతరం ట్యాగ్ చేసిన మిల్లులకు తరలించాలన్నారు. ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని, రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని స్పష్టం చేశారు.

వేసవి ఎండల నేపథ్యంలో నిర్వాహకులు, రైతులు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON

Next Story