Jangaon: ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ బడులు.. విద్యా ప్రమాణాలపై కలెక్టర్ సమీక్ష!

Jangaon: జనగామ జిల్లాలోని ప్రభుత్వ బడులను ప్రైవేట్‌కు దీటుగా తీర్చిదిద్దడమే "మిషన్ శిఖరం" లక్ష్యమని విద్యాశాఖ సమీక్షలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా స్పష్టం చేశారు.

MD AHMAD PASHA, JANGAON
Published on: 2 Sept 2026 10:54 PM IST
Jangaon
X

Jangaon: ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ బడులు.. విద్యా ప్రమాణాలపై కలెక్టర్ సమీక్ష!

జనగామ: జనగామ "మిషన్ శిఖరం" ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు, మౌలిక వసతులు పెంపొందించాలి – జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా.​ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దడమే "మిషన్ శిఖరం" ప్రధాన లక్ష్యం: కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ​ప్రభుత్వ పాఠశాలలు, మోడల్ స్కూల్స్, KGBVల MEOలు, ప్రిన్సిపాళ్లు, హెచ్‌ఎంలతో సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ ​బడుల్లో డిజిటల్, సాంకేతిక ఆధారిత బోధనను విస్తృతంగా అమలు చేస్తున్నట్లు వెల్లడించిన కలెక్టర్ ​ప్రతి పాఠశాలలో తాగునీరు.

విద్యుత్, మరుగుదొడ్లు, శుభ్రత, SSCP భద్రతా ప్రమాణాలు 100% ఉండాలని ఆదేశం ​విద్యార్థుల్లో భాషా నైపుణ్యాలు, గణితంలో ప్రావీణ్యం పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని సూచన ​"ఫాస్ట్ మ్యాథ్స్" పుస్తకాలతో నిరంతర సాధన చేయించి విద్యార్థుల్లో గణిత నైపుణ్యాలు పెంచాలని ఆదేశం ​TAPDO కార్యక్రమం ద్వారా ఉపాధ్యాయుల బోధనా నైపుణ్యాలను మరింత పెంపొందించాలి: కలెక్టర్ ​పాఠశాలల్లో అటెండెన్స్ మానిటరింగ్ సిస్టమ్ (AMS), ఇంటర్నెట్ వినియోగం సమర్థవంతంగా జరగాలని వెల్లడి​"మిషన్ శిఖరం" జిల్లా కన్సాలిడేటెడ్ నివేదికను విడుదల చేసి, పాఠశాలలకు జనరల్ నాలెడ్జ్ పుస్తకాలు, మ్యాప్‌లను పంపిణీ చేసిన కలెక్టర్.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON

Next Story