Jangaon: జనగాం ప్రజావాణి అరగంటలోనే చిన్నారికి ఆరోగ్యశ్రీ కార్డు!
Jangaon: జనగాం జిల్లా ప్రజావాణిలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మానవతా దృక్పథం చాటుకున్నారు.
Jangaon: జనగాం ప్రజావాణి అరగంటలోనే చిన్నారికి ఆరోగ్యశ్రీ కార్డు!
జనగాం: ఏడాది వయసున్న తన కుమార్తె అల్ఫియనూర్ పేరు ఆరోగ్యశ్రీ కార్డులో లేక చికిత్సకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని బాణాపురం కాలనీకి చెందిన మహమ్మద్ రఫత్ ప్రజావాణిలో కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించడంతో అరగంటలోనే చిన్నారి పేరు ఆరోగ్యశ్రీ కార్డులో నమోదైంది. దీంతో కంటి శస్త్రచికిత్సకు అయ్యే రూ.60-70 వేల ఖర్చు నుంచి కుటుంబానికి ఊరట లభించింది.
ఈ సందర్భంగా మహమ్మద్ రఫత్ మాట్లాడుతూ: తమలాంటి నిరుపేద కుటుంబ సమస్యను వెంటనే పరిష్కరించిన *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజావాణి ద్వారా సామాన్య ప్రజల సమస్యలకు వేగంగా పరిష్కారం లభిస్తోందని, ప్రభుత్వంపై తమకు మరింత నమ్మకం పెరిగింది.
Next Story




