Warangal: వరంగల్‌లో ఓటరు సవరణ హియరింగ్ పరిశీలించిన కలెక్టర్ సత్య శారద!
Warangal: సమగ్ర ఓటరు సవరణ (SIR) హియరింగ్ ప్రక్రియను కలెక్టర్ డాక్టర్ సత్య శారద మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేసి అధికారులకు మార్గదర్శకాలు జారీ చేశారు.
Warangal: వరంగల్‌లో ఓటరు సవరణ హియరింగ్ పరిశీలించిన కలెక్టర్ సత్య శారద!
వరంగల్ జిల్లా, సెప్టెంబర్ 2, 2026: సమగ్ర ఓటరు సవరణ (SIR) ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద IAS మంగళవారం కాశీబుగ్గ మున్సిపల్ సర్కిల్ కార్యాలయం, వరంగల్ మండల తహసీల్దార్ కార్యాలయంలో జరుగుతున్న ఓటరు హియరింగ్ ప్రక్రియను పరిశీలించారు.
వరంగల్ ఆర్డీవోతో కలిసి ఆయా కార్యాలయాలను సందర్శించిన కలెక్టర్, సమగ్ర ఓటరు సవరణ కి సంబంధించిన దరఖాస్తులు, అభ్యంతరాలపై నిర్వహిస్తున్న హియరింగ్ ప్రక్రియను పరిశీలించారు.
ఈ సందర్భంగా సంబంధిత అధికారులు ఎన్నికల సంఘం మార్గదర్శకాలను కచ్చితంగా పాటిస్తూ హియరింగ్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చే అభ్యంతరాలు, దరఖాస్తులను నిబంధనల ప్రకారం పరిశీలించి సకాలంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
సమగ్ర ఓటరు సవరణ ప్రక్రియలో ఎలాంటి జాప్యం లేకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ప్రతి అంశాన్ని నిబంధనలకు అనుగుణంగా పరిశీలించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సూచించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ ఆర్డీవో, సంబంధిత తహసీల్దార్లు, ఎన్నికల శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.




