Damera: మహిళలకు ఉపాధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలి

Damera: హనుమకొండ జిల్లా దామెర మండలం ల్యాదేళ్ల స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను సందర్శించి, వారం రోజుల్లో శిక్షణ ప్రారంభించాలని ఆదేశించిన కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్.

NARENDER, WARANGAL
Published on: 4 Jun 2026 5:15 PM IST
Damera
X

Damera: మహిళలకు ఉపాధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలి

దామెర: మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ద్వారా ఉపాధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అన్నారు.

గురువారం హనుమకొండ జిల్లా దామెర మండలం ల్యాదేళ్లలోని మహిళా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా సెంటర్ ద్వారా నిర్వహించనున్న శిక్షణ కార్యక్రమాలు, శిక్షణకు సంబంధించిన మెటీరియల్, సెంటర్ లోని వివిధ శిక్షణ విభాగాలను పరిశీలించారు. సౌకర్యాలను పరిశీలించి కేంద్రం గురించిన వివరాలను డిఆర్డిఓ మేన శ్రీను, అధికారులు కలెక్టర్ కు వివరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ మహిళలకు ఉపయోగపడే విధంగా వారం రోజుల్లో శిక్షణ కార్యక్రమాలను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా శిక్షణ కార్యక్రమాలను మహిళలు సద్వినియోగం చేసుకొని లబ్ధి పొందే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు.

అనంతరం మండల సమైక్య కార్యాలయం కోసం శంకుస్థాపన చేసిన భూమి వివరాలను తహసిల్దార్ జ్యోతి వరలక్ష్మి దేవిని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచి రవి యాదవ్, అడిషనల్ డిఆర్డిఓ లక్ష్మీ ప్రసన్న, ఎంపీడీవో కల్పన, డీపీఎం రాజేంద్రప్రసాద్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

NARENDER, WARANGAL

NARENDER, WARANGAL

Next Story