Hanumakonda:డాక్టర్స్ డే వేడుకలు.. ప్రముఖ వైద్యులకు ఘన సన్మానం!

Hanumakonda: హనుమకొండ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో జాతీయ వైద్యుల దినోత్సవం ఘనంగా జరిగింది.

Narender, Staff Reporter  -Warangal
Published on: 1 July 2026 5:23 PM IST
Hanumakonda
X

Hanumakonda:డాక్టర్స్ డే వేడుకలు.. ప్రముఖ వైద్యులకు ఘన సన్మానం!

హనుమకొండ: జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం హనుమకొండ జిల్లా రెడ్ క్రాస్ భవన్‌లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, హనుమకొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి హనుమకొండ జిల్లా కలెక్టర్ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ అధ్యక్షురాలు శ్రీమతి చాహత్ బాజ్‌పాయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ముందుగా జిల్లా కలెక్టర్ మరియు రెడ్ క్రాస్ పాలకవర్గ సభ్యులు ప్రముఖ వైద్యుడు, భారతరత్న డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ జయంతి-వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ మాట్లాడుతూ, డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ సేవలు ప్రతి వైద్యునికి ఆదర్శప్రాయమని, ప్రజారోగ్య పరిరక్షణలో వైద్యులు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు.

ప్రజల్లో ఆరోగ్య అవగాహన పెంపొందించడంతో పాటు ప్రజారోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో వైద్యులు తమ సేవలను కొనసాగించాలని ఆకాంక్షించారు, జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా జిల్లాలోని వైద్యులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రజారోగ్య పరిరక్షణలో వారి సేవలు మరింత విస్తరించాలని జిల్లా కలెక్టర్ ఆకాంక్షించారు.

రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ పి. విజయచందర్ రెడ్డి మాట్లాడుతూ, డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ స్మారకార్థం ప్రతి సంవత్సరం జూలై 1న జాతీయ వైద్యుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని, వైద్య రంగానికి ఆయన అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయనను భారతరత్న పురస్కారంతో సత్కరించిందని తెలిపారు.

రెడ్ క్రాస్ పాలకవర్గ సభ్యులు మాట్లాడుతూ, “అమ్మ మనకు జన్మనిస్తే, అనారోగ్య సమయంలో మన ప్రాణాలను కాపాడి పునర్జన్మను ప్రసాదించేవారు వైద్యులు” అని పేర్కొంటూ, వైద్యుల నిస్వార్థ సేవలు సమాజానికి ఎంతో అమూల్యమని కొనియాడారు.

ఈ సందర్భంగా డాక్టర్స్ డే పురస్కరించుకుని హనుమకొండ డీఎం & హెచ్‌ఓ డా. ఎస్.డి. రాంకుమార్, రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డా. పి. విజయచందర్ రెడ్డి, జిల్లా పాలకవర్గ సభ్యులు డా. కె. సుధాకర్ రెడ్డి, డా. మాగంటి శేషుమాధవ్, ఆర్థోపెడిక్ సర్జన్ డా. పి. కాళీప్రసాద్ రావు, ఐఎంఏ అధ్యక్షులు డా. మన్మోహన్ రాజు, ఐఎంఏ ప్రెసిడెంట్ ఎలెక్ట్ మరియు వరంగల్ క్లబ్ కార్యదర్శి డా. పి. ప్రవీణ్, తానా అధ్యక్షులు డా. దిలీప్ కుమార్, వరంగల్ క్లబ్ కోశాధికారి డా. పి. సుదీర్

కుమార్ , పిల్లల వైద్య నిపుణులు డా. బైరి లక్ష్మీనారాయణ, రెడ్ క్రాస్ వైద్యులు డా. జె. కిషన్ రావు, డా. టి. మదన్ మోహన్ రావు, డా. మొహమ్మద్ తహర్ మసూద్‌లను జిల్లా కలెక్టర్ మరియు రెడ్ క్రాస్ పాలకవర్గ సభ్యులు శాలువాలు, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ పెద్ది వెంకట నారాయణ గౌడ్, కోశాధికారి బొమ్మినేని పాపిరెడ్డి, రాష్ట్ర మేనేజింగ్ కమిటీ సభ్యులు ఇ.వి. శ్రీనివాస్ రావు, జిల్లా పాలకవర్గ సభ్యులు పుల్లూరు వేణుగోపాల్, డా. మాగంటి శేషుమాధవ్, డా. కె. సుధాకర్ రెడ్డి, రెడ్ క్రాస్ సిబ్బంది మరియు పలువురు వైద్యులు పాల్గొన్నారు.

– ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, హనుమకొండ జిల్లా శాఖ

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story