Jangaon: ట్యాంక్‌బండ్‌పై పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ: చలో హైదరాబాద్‌కు పిలుపు!
Jangaon: ఈ నెల 18న హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు.
Jangaon: ట్యాంక్‌బండ్‌పై పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ: చలో హైదరాబాద్‌కు పిలుపు!
జనగామ: హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 366 జయంతి సందర్బంగా ఆ మహనీయుని విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ నెల 18వ తేదీన ఆవిష్కరించనున్న సందర్భంగా చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు గౌడ అఫీషియల్ ప్రొఫెషనల్ అసోసియేషన్(గోపా) రాష్ట్ర ఉపాధ్యక్షులు కుర్రెముల యాదగిరి గౌడ్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం వారి అధ్యక్షతన ఈరోజు జనగామ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలు, సామాజిక సమానత్వం, ఆత్మగౌరవం కోసం ఆయన చేసిన పోరాటాన్ని స్మరించుకుంటూ పెద్ద సంఖ్యలో జిల్లాలోని గౌడ సోదరులందరూ హైదరాబాద్‌కు తరలిరావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో గోపా జిల్లా నాయకులు మేకపోతుల ఆంజనేయులు గౌడ్,బైరగోని శ్రీనివాస్ గౌడ్, దూడల రాజ సంపత్ గౌడ్, దూడల రమేష్ గౌడ్, అంబటి రాజయ్య గౌడ్ వగలబోయిన విజయ్ కుమార్ గౌడ్, ఓడపల్లి అశోక్ గౌడ్,గునిగంటి రామకృష్ణ గౌడ్, బాల్నె విద్యాసాగర్ గౌడ్, మల్కాపురం రామకృష్ణ గౌడ్, చెరుకు మల్లేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు .
ఈ నెల 18న ట్యాంక్ బండ్ మీద సాయంత్రం నాలుగు గంటలకు జరిగే విగ్రహావిష్కరణకు చలో హైదరాబాద్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.




