Bhupalpally: బీజేపీ ఆఫీసులపై దాడులు రాజ్యాంగ విరుద్ధం: చల్ల నారాయణ రెడ్డి!
Bhupalpally: నల్లగొండలో బీజేపీ కార్యాలయాలపై కాంగ్రెస్ శ్రేణుల దాడులు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని, దీన్ని బ్లాక్ డేగా భావిస్తున్నామని బీజేపీ నేత చల్ల నారాయణరెడ్డి మండిపడ్డారు.
Bhupalpally: బీజేపీ ఆఫీసులపై దాడులు రాజ్యాంగ విరుద్ధం: చల్ల నారాయణ రెడ్డి!
భూపాలపల్లి: కాటారం మండల బీజేపీ అధ్యక్షుడు పాగె రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చల్ల నారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్గొండలో బీజేపీ రాష్ట్ర, జిల్లా కార్యాలయాలపై కాంగ్రెస్ శ్రేణుల దాడులను తీవ్రంగా ఖండించారు. దాడులను నిరసిస్తూ ఈ ఘటనను బ్లాక్ డేగా భావిస్తున్నామని తెలిపారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావును నల్గొండకు వెళ్లకుండా పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమన్నారు. ప్రతిపక్షాలపై దాడులు, నాయకుల నిర్బంధాలతో ప్రజాస్వామ్యాన్ని అణచివేయలేరని బీజేపీ మండల అధ్యక్షుడు పాగె రంజిత్ కుమార్ అన్నారు. దాడులకు పాల్పడిన వారిపై వెంటనే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




