Hanamkonda: పరకాలలో జాతీయ జెండా ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి

Hanamkonda: పరకాలలో మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి జాతీయ జెండా ఆవిష్కరణ. బీఆర్‌ఎస్ హయాంలో కట్టిన ఆస్పత్రికే రంగులేసి ప్రచారం చేసుకుంటున్నారని కాంగ్రెస్‌పై విమర్శలు.

M PRABHAKAR, PARAKAL
Published on: 16 Aug 2026 12:17 PM IST
Hanamkonda
X

Hanamkonda: పరకాలలో జాతీయ జెండా ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి

Hanamkonda: 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పరకాల పట్టణంలో నిర్వహించిన వేడుకల్లో పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు.

జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం జెండాకు గౌరవ వందనం సమర్పించి, దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన మహనీయులను స్మరించుకున్నారు. అనంతరం ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ, బీఆర్‌ఎస్‌ హయాంలో,కేసీఆర్ సహకారంతో పరకాల ప్రజల ఆకాంక్ష మేరకు మంజూరుచేసి పూర్తి చేసిన 100 పడకల ఆసుపత్రి, డిగ్రీ కళాశాలకు రంగులు వేసి,తామే అభివృద్ధి చేసినట్లు ఎమ్మెల్యే గొప్పలు చెప్పుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి విమర్శించారు.

రెండున్నరేళ్లలో పరకాల పట్టణానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం కొత్తగా చేసిందేమీ లేదని, పూర్తయిన 100 పడకల ఆసుపత్రిని ఇంతకాలం ప్రజలకు ఎందుకు అందుబాటులోకి తీసుకురాలేకపోయారో ఎమ్మెల్యే ఆత్మవిమర్శ చేసుకోవాలని అన్నారు.ఇప్పటికీ హాస్పిటల్ కి సంబంధించిన పరికరాలు అందుబాటులో లేవని,సిబ్బంది నియామకం కూడా కాలేదని అన్నారు.సిబ్బంది నియామకం పారదర్శకంగా ఉండాలని డిమాండ్ చేసారు.

బీఆర్‌ఎస్‌ చేసిన పనులకు రంగులు వేసుకోవడం కాదు కాంగ్రెస్‌ చేసిన ఒక్క కొత్త అభివృద్ధి పనినైనా ప్రజలకు చూపించాలని చల్లా ధర్మారెడ్డి సవాల్‌ విసిరారు.

M PRABHAKAR, PARAKAL

M PRABHAKAR, PARAKAL

Next Story