Wardhannapet: ఎస్సారెస్పీ కాల్వలకు సాగునీరు విడుదల చేయాలి!
Wardhannapet: వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో ఎస్సారెస్పీ కాల్వలకు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ నాయకులు రైతులతో కలిసి పాదయాత్ర నిర్వహించారు.
Wardhannapet: ఎస్సారెస్పీ కాల్వలకు సాగునీరు విడుదల చేయాలి!
Wardhannapet: కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల పాలనపై వైఫల్యాలను ఎండగడుతూ టిఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎనిమిది రోజుల కార్యక్రమంలో ఈరోజు రాయపర్తి మండలంలోని విద్యానగర్ తండా కెనాల్ నుండి తిరుమలాయపల్లి కెనాల్ వరకు రైతుల సాగునీటి సమస్య పరిష్కారం కోసం బీఆర్‌ఎస్ నాయకులు కెనాల్ బాట పట్టారు.
రాయపర్తి మండలంలోని ఎస్సారెస్పీ కాల్వలకు వెంటనే సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ శ్రేణులు రైతులతో కలిసి పాదయాత్ర చేపట్టారు.సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నాయకులు పేర్కొన్నారు. పంటలకు కీలకమైన సమయంలో కాల్వల్లో నీరు లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి ఎస్సారెస్పీ కాల్వలకు నీటిని విడుదల చేసి రైతుల పంటలను కాపాడాలని డిమాండ్ చేశారు.రైతుల సాగునీటి హక్కుల కోసం అవసరమైతే మరిన్ని ఆందోళన కార్యక్రమాలు చేపడతామని బీఆర్‌ఎస్ నాయకులు స్పష్టం చేశారు.




