Mahabubabad: మహబూబాబాద్‌లో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు!

Mahabubabad: మహబూబాబాద్ బీఆర్ఎస్ ఆఫీస్‌లో కేటీఆర్ బర్త్‌డే! కాళేశ్వరం నీటిని వెంటనే విడుదల చేసి రైతులను ఆదుకోవాలని డాక్టర్ రాంమోహన్ డిమాండ్.

A RAJKUMAR, MAHABOOBABAD
Published on: 24 July 2026 5:47 PM IST
Mahabubabad
X

Mahabubabad: మహబూబాబాద్‌లో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు!

మహబూబాబాద్ జిల్లా:

రిపోర్టర్ ఏ రాజ్ కుమార్

బి.ఆర్.ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినం సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రం లోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం లో బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ నాయకుడు డాక్టర్ రాంమోహన్ రెడ్డి మాట్లాడుతూ, బిఆర్ఎస్ పార్టీ పరిపాలనా కాలం లో రాష్ట్రం లో అభివృద్ధి చెందిందని, నేడు రాష్ట్రం లోని ప్రజలంతా నిరాశ నిస్పృహల తో ఉన్నారని, ఎస్సారెస్పీ ద్వారా సాగు నీరు అందక రైతాంగం ఇబ్బందులు పడుతుంటే , కేసిఆర్ కాలేశ్వరం ను ప్రాజెక్టు నిర్మించాలని, రాష్ట్ర ప్రభుత్వం కాలేశ్వరం నుంచి నీటిని విడుదల చేయకుండా రాజకీయాలు చేస్తున్నారని, రాజకీయాలను పక్కనపెట్టి వెంటనే కాళేశ్వరం నీటిని విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ జన్మదిన వేడుకల్లో బిఆర్ఎస్ పార్టీ కి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

A RAJKUMAR, MAHABOOBABAD

A RAJKUMAR, MAHABOOBABAD

Next Story