Narsampet: నర్సంపేట డివిజన్ బంద్ ప్రశాంతంగా ప్రైవేట్ స్కూళ్లు షాపులు బంద్
Narsampet: నర్సంపేటలో పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దె కూల్చివేతపై ఆగ్రహం. బీఆర్ఎస్ డివిజన్ బంద్‌కు వ్యాపార, విద్యాసంస్థలు స్వచ్ఛందంగా మద్దతు.
Narsampet: నర్సంపేట డివిజన్ బంద్ ప్రశాంతంగా ప్రైవేట్ స్కూళ్లు షాపులు బంద్
Narsampet: నర్సంపేటలో దివంగత మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం ఏర్పాటు కోసం నిర్మించిన గద్దెను మున్సిపల్ అధికారులు తొలగించిన ఘటనపై బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ఘటనకు నిరసనగా బీఆర్ఎస్ నాయకుల పిలుపు మేరకు నర్సంపేట డివిజన్ బంద్‌కు వర్తక, వాణిజ్య, వ్యాపార వర్గాలు స్వచ్ఛందంగా మద్దతు ప్రకటించాయి.
దీంతో నర్సంపేటలో పలు దుకాణాలు, వ్యాపార, ప్రైవేటు స్కూలు,కాలేజీలు సంస్థలు మూసివేసి బంద్‌కు సంఘీభావం తెలిపారు.
Next Story




