Jangaon: జనగామలో బీజేవైఎం నిరసన రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం!
Jangaon: జనగామ పట్టణంలో బీజేవైఎం ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం. పెండింగ్‌లో ఉన్న రూ. 15 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్.
Jangaon: జనగామలో బీజేవైఎం నిరసన రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం!
Jangaon: పెండింగ్‌లో ఉన్న రూ. 15 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జనగామ పట్టణంలో బీజేవైఎం (BJYM) ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ఎల్లబోయిన హరీష్ మాట్లాడుతూ తెలంగాణలో 40 లక్షల మంది పేద విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఆధారపడి చదువుకుంటుంటే, ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయకపోవడం దారుణమన్నారు.
విద్యార్థులను చదువుకు దూరం చేసే కుట్రను ప్రభుత్వం విరమించుకోవాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్త ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి చింతకింది సంతోష్ మాట్లాడుతూ.. వరంగల్ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీ మేరకు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేద విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీజేవైఎం నాయకులు దండేబోయిన, దాడిగే రవి, కుమార్, గణేష్, మహేష్, శరత్, అఖిల్, రాజు, సంపత్, గువ్వా సతీష్ తదితరులు పాల్గొన్నారు.




