Kesamudram: విద్యార్థుల హక్కుల సాధనకై సోమవారం బీజేపీ మహా ధర్నా: ఉప్పునూతల రమేష్
Kesamudram: కాంగ్రెస్ ప్రభుత్వ విద్యార్థి వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సెప్టెంబర్ 7న ఇందిరాపార్క్ వద్ద బీజేపీ మహా ధర్నా చేపట్టనుంది.
Kesamudram: విద్యార్థుల హక్కుల సాధనకై సోమవారం బీజేపీ మహా ధర్నా: ఉప్పునూతల రమేష్
Kesamudram: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని, విద్యార్థి లోకాన్ని అడుగడుగునా దగా చేస్తోందని కేసముద్రం బీజేపీ మండల అధ్యక్షుడు ఉప్పునూతల రమేష్ తీవ్రంగా ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా మరియు విద్యార్థుల న్యాయమైన హక్కుల సాధనకై ఈ నెల సెప్టెంబర్ 7న (సోమవారం) భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద నిర్వహించనున్న బిజెపి ‘మహా ధర్నా’ (ఛలో ఇందిరాపార్క్ )కార్యక్రమాన్ని విద్యార్థులు, యువకులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఉప్పునూతల రమేష్ మాట్లాడుతూ, రాష్ట్రంలో దాదాపు రూ.15 వేల కోట్ల ఫీ రీయింబర్స్‌మెంట్ బకాయిలను నిలిపివేసి, సుమారు 40 లక్షల మంది విద్యార్థుల ఉన్నత చదువుల కలలను కాంగ్రెస్ ప్రభుత్వం కల్లలు చేసిందని విమర్శించారు. అంతేకాకుండా, ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద జీవో 97 ద్వారా పాలిటెక్నిక్ విద్యార్థుల భవితను పూర్తిగా కాలరాసిందని మండిపడ్డారు.
విద్యా రంగాన్ని నిర్వీర్యం చేస్తూ, అనేక సమస్యలతో విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. విద్యార్థుల న్యాయమైన హక్కుల కోసం భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో చేపట్టే ఈ మహాధర్నాకు కేసముద్రం మండలం నుండి విద్యార్థులు, నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలిరావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.




