Bhupalpally: పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ నూతన కమిటీకి ఎస్పీ అభినందనలు!
Bhupalpally: జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఐపీఎస్‌ను మర్యాదపూర్వకంగా కలిసింది.
Bhupalpally: పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ నూతన కమిటీకి ఎస్పీ అభినందనలు!
భూపాలపల్లి: భూపాలపల్లి జిల్లా పోలీసు ఆఫీసర్స్ అసోసియేషన్ నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ఐపీఎస్ నీ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులకు ఎస్పీ అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నూతన కార్యవర్గం పోలీసు అధికారులు, సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఎస్పీ ఆకాంక్షించారు. పోలీసు శాఖలో ఐక్యత, పరస్పర సహకారం, సమన్వయాన్ని మరింత బలోపేతం చేస్తూ సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. పోలీసు అధికారులు, సిబ్బంది సంక్షేమం కోసం అసోసియేషన్ చేపట్టే కార్యక్రమాలకు జిల్లా పోలీసు శాఖ తరఫున పూర్తి సహకారం అందిస్తామని ఎస్పీ తెలిపారు.
నూతన కార్యవర్గం
అధ్యక్షులు గూగులోతు నరేష్, ఎస్‌బీ కానిస్టేబుల్, భూపాలపల్లి. ఉపాధ్యక్షులు ఎన్. వెంకటేశ్వర్లు, ఇన్‌స్పెక్టర్, మహాదేవపూర్. ఎస్. సాంబమూర్తి, ఎస్‌ఐ, మహాదేవపూర్. కార్యదర్శి బి. అశోక్, ఎస్‌ఐ, ఘనపూర్.




