Bhupalpally: భూపాలపల్లి అమృత వర్షిణి వృద్ధాశ్రమంలో ఘనంగా రాఖీ వేడుకలు

Bhupalpally: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అమృత వర్షిణి వృద్ధాశ్రమంలో వృద్ధులకు రాఖీలు కట్టి ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు నిర్వహించారు.

Bhoomi Reddy, Bhupalpally
Published on: 28 Aug 2026 4:19 PM IST
Bhupalpally
X

Bhupalpally: భూపాలపల్లి అమృత వర్షిణి వృద్ధాశ్రమంలో ఘనంగా రాఖీ వేడుకలు

భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రం లోని అమృత వర్షిణి వృద్ధాశ్రమంలో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. brs పార్టీ జిల్లా నాయకులు మాడ హరీష్ రెడ్డి ఆధ్వర్యంలో రాఖీ వేడుకలు జరుగగా ప్రముఖ గైనకాలజిస్టు డాక్టర్ ప్రత్యూష రెడ్డి, తో పాటు పలువురు మహిళలు వృద్ధాశ్రమాన్ని సందర్శించి అక్కడి వృద్ధులకు రాఖీలు కట్టి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం వృద్ధులకు స్వీట్లు తినిపించి, వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వృద్ధులు భావోద్వేగానికి గురయ్యారు. "మాకు ఎవరూ లేకపోయినా సోదరీమణుల్లాగా రాఖీ కట్టి ఆప్యాయంగా పలకరించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇంత మందిని చూస్తుంటే తమ కుటుంబ సభ్యులు వచ్చినట్లుగా అనిపించింది" అంటూ ఆనందం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా డాక్టర్ ప్రత్యూష రెడ్డి మాట్లాడుతూ, వృద్ధులను ఆదరించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని అన్నారు. పండుగలు అందరితో కలిసి జరుపుకున్నప్పుడే వాటికి నిజమైన అర్థం ఉంటుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు.

Bhoomi Reddy, Bhupalpally

Bhoomi Reddy, Bhupalpally

Next Story