Bhupalpally: వినాయక చవితి ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి – డీఎస్పీ

Bhupalpally: భూపాలపల్లిలో వినాయక చవితి ఉత్సవాల నిర్వహణపై పోలీస్ అధికారుల సమావేశం. నిబంధనలు పాటించాలని, సైబర్ భద్రతపై అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ సూచన.

Bhoomi Reddy, Bhupalpally
Published on: 11 Sept 2026 5:33 PM IST
Bhupalpally
X

Bhupalpally: వినాయక చవితి ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి – డీఎస్పీ

భూపాలపల్లి: వినాయక చవితి ఉత్సవాలను శాంతియుతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించాలని డీఎస్పీ సంపత్ రావు అన్నారు. మండపాల ఏర్పాటు, విద్యుత్ వినియోగం, డీజేలు, ట్రాఫిక్‌, భద్రత తదితర అంశాల్లో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.

ఈనెల 14న జరగనున్న వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో భూపాలపల్లి పోలీసులు గణేష్ మండపాల నిర్వాహకులకు పలు కీలక సూచనలు చేశారు.

భూపాలపల్లి పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన సమావేశంలో డీఎస్పీ సంపత్ రావు, సీఐ శ్రీనివాస్ పాల్గొని మండపాల నిర్వాహకులతో మాట్లాడారు. మండపాల ఏర్పాటు, విద్యుత్ వినియోగం, డీజేలు, ట్రాఫిక్‌, భద్రత తదితర అంశాల్లో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.

అలాగే మండపాల వద్ద భక్తుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఎలాంటి సమస్యలు ఎదురైనా వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ సందర్భంగా సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన పోస్టర్‌ను పోలీసులు ఆవిష్కరించారు. ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద లింకులు, కాల్స్‌, మెసేజ్‌లకు స్పందించవద్దని అవగాహన కల్పించారు.

డీఎస్పీ సంపత్ రావు మాట్లాడుతూ, గణేష్ మండపాల నిర్వాహకులు పోలీసుల సూచనలు, నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని కోరారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.

వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా భక్తుల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.

Bhoomi Reddy, Bhupalpally

Bhoomi Reddy, Bhupalpally