Bhupalpally: సింగరేణి కార్మికులకు కాంగ్రెస్ మొండిచేయి గండ్ర వెంకటరమణారెడ్డి!
Bhupalpally: కేటీకే 8వ గని వద్ద బీఆర్‌ఎస్ గేట్ మీటింగ్. ఎన్నికల హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తీవ్ర విమర్శలు.
Bhupalpally: సింగరేణి కార్మికులకు కాంగ్రెస్ మొండిచేయి గండ్ర వెంకటరమణారెడ్డి!
Bhupalpally: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు సింగరేణి కార్మికులకు అనేక హామీలు అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల సమస్యల పరిష్కారంలో మొండిచేయి చూపుతోందని భూపాలపల్లి బిఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు.
భూపాలపల్లి జిల్లా సింగరేణి ఏరియా కెటికె 8 వ గనిలో లో ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ఏ విధంగా కార్మికుల సంక్ఖేమాన్ని విస్మరించిందో కార్మికులకు తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు తెలంగాణ ప్రజలకు 6 గ్యారంటీలు, అనేక హామీలు ఇచ్చినట్లుగానే సింగరేణి కార్మికులకు కూడా 6 గ్యారెంటీల వాగ్దానాలు చేసిందన్నారు.
కార్మికులు కాంగ్రెస్ పార్టీని నమ్మి అధికారంలోకి తీసుకొచ్చినప్పటికీ, వారి సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా బాకీ కార్డులను పంపిణీ చేశారు.




