Bhupalpally: కాంగ్రెస్ 1000 రోజుల పాలన దగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి

Bhupalpally: కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో హామీలను నెరవేర్చడంలో విఫలమైందని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి విమర్శించారు.

RAJU, BHUPALAPALLI
Published on: 31 Aug 2026 5:56 PM IST
Bhupalpally
X

Bhupalpally: కాంగ్రెస్ 1000 రోజుల పాలన దగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి

భూపాలపల్లి: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారెంటీలు, 420 హామీలను 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి, 1000 రోజుల పాలన పూర్తయినా అనేక హామీలను నెరవేర్చలేదని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, మాజీ జడ్పీ చైర్‌పర్సన్ గండ్ర జ్యోతి విమర్శించారు. సోమవారం భూపాలపల్లిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.

మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, కళ్యాణలక్ష్మితో పాటు తులం బంగారం, వృద్ధులు–వితంతువులు–వికలాంగులకు రూ.4 వేల పెన్షన్ వంటి హామీలు అమలు కాలేదన్నారు. రైతు పెట్టుబడి సాయం, రైతు బీమా, యూరియా, సాగునీరు, వ్యవసాయ విద్యుత్ విషయంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు.

22-ఏ భూముల సమస్యను పరిష్కరించాలని, నిరుద్యోగులకు భృతి, ఉద్యోగాల భర్తీపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. బీఆర్‌ఎస్‌ హయాంలో చేపట్టిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు నిలిచిపోయాయని విమర్శించారు.

సెప్టెంబర్ 2 నుంచి బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ‘1000 రోజుల దగా పాలనపై సమరభేరి’ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.

RAJU, BHUPALAPALLI

RAJU, BHUPALAPALLI

Next Story