Bhupalpally: మంత్రి శ్రీధర్‌బాబుపై మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు విమర్శలు
Bhupalpally: కాటారం అభివృద్ధిని మంత్రి శ్రీధర్‌బాబు విస్మరించారన్న మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు. చెరువుల పరిశీలన, భూనిర్వాసితుల సమస్యలపై తీవ్ర ఆగ్రహం.
Bhupalpally: మంత్రి శ్రీధర్‌బాబుపై మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు విమర్శలు
భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం ప్రజలకు ప్రతి ఎన్నికల్లో మెజార్టీ వచ్చినా దుద్దిళ్ల శ్రీధర్ చేసిందేమీ లేదని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ విమర్శించారు.
సోమవారం ఒడిపిలవంచ ఊర చెరువు, జాదరావుపేట పెద్ద చెరువు, వీరాపూర్ శివశంకర్ ప్రాజెక్టులను బీఆర్‌ఎస్ శ్రేణులతో కలిసి పరిశీలించారు.
చెరువుల్లో నీటిని నిల్వ చేయకపోవడంతో వేల ఎకరాలు సాగుకు నోచుకోవడం లేదన్నారు. కాళేశ్వరం భూనిర్వాసితులకు పరిహారం ఇవ్వలేదని ఆరోపించారు.
కాటారం ప్రజల సమస్యలను పట్టించుకోని దుద్దిళ్ల శ్రీధర్ మెడలు వంచే వరకు పోరాడుతానన్నారు. వచ్చే వానాకాలం నాటికి చెరువులను పునరుద్ధరించి భూములను సాగులోకి తేవాలని డిమాండ్ చేశారు.




