Bhupalpally: రుణాల మంజూరులో వేగం పెంచాలి బ్యాంకర్లకు అదనపు కలెక్టర్ ఆదేశం!
Bhupalpally: వెనుకబడిన రంగాలు, ప్రాధాన్యతా రంగాలు మరియు పథకాల రుణాల మంజూరులో వేగం పెంచాలని బ్యాంకర్లను ఆదేశించిన జయశంకర్ భూపాలపల్లి అదనపు కలెక్టర్ అశోక్ కుమార్.
Bhupalpally: రుణాల మంజూరులో వేగం పెంచాలి బ్యాంకర్లకు అదనపు కలెక్టర్ ఆదేశం!
Bhupalpally: వెనుకబడిన రంగాలకు రుణాల మంజూరులో వేగం పెంచాలని అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ బ్యాంకర్లను ఆదేశించారు. శుక్రవారం ఐడీఓసీలో నిర్వహించిన జిల్లా స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.
2026–27 ఆర్థిక సంవత్సరానికి ప్రాధాన్యతా రంగాల రుణ లక్ష్యం రూ.2,599.49 కోట్లు కాగా, జూన్ త్రైమాసికం నాటికి రూ.451.73 కోట్లు (17.38 శాతం) సాధించినట్లు తెలిపారు. వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, విద్య, గృహ రుణాల మంజూరుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
PM విశ్వకర్మ, PMEGP దరఖాస్తులను వేగంగా పరిష్కరించి అర్హులకు రుణాలు అందించాలని ఆదేశించారు. డిపాజిట్ల సేకరణతో పాటు రుణాల మంజూరులో వెనుకబడిన బ్యాంకులు పనితీరును మెరుగుపరచుకోవాలని సూచించారు. పలిమేల, మొగుళ్లపల్లి, ఘన్‌పూర్ మండలాల్లో 10 రోజుల ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి నిరుపయోగ ఖాతాలను పునరుద్ధరించాలని ఆదేశించారు.
సమావేశంలో లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ నాగరాజు, బ్యాంకు అధికారులు, జిల్లా శాఖల అధికారులు పాల్గొన్నారు.




