Bhupalpally: భూపాలపల్లి కలెక్టరేట్ ఎదుట ఉద్రిక్తత జీవో 97 రద్దుకు డిమాండ్

Bhupalpally: జీవో 97 రద్దు చేయాలని భూపాలపల్లి కలెక్టరేట్ ఎదుట విద్యార్థుల ధర్నా. నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు, పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత.

Narender, Staff Reporter  -Warangal
Published on: 25 Aug 2026 6:51 AM IST
Bhupalpally
X

Bhupalpally: భూపాలపల్లి కలెక్టరేట్ ఎదుట ఉద్రిక్తత జీవో 97 రద్దుకు డిమాండ్

Bhupalpally: ఆగస్టు 27న రాష్ట్రంలోని అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో గ్రామ సభలు/వార్డు సభలు నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి ఆదేశించారు.

ఎస్‌ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమంపై తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.

జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి *జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ సత్య శారద పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, ఆగస్టు 27న అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో గ్రామ సభలు/వార్డు సభలు నిర్వహించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో సంబంధిత గ్రామ పంచాయతీ భవనంలో, పట్టణ ప్రాంతాల్లో సంబంధిత పోలింగ్ కేంద్రంలో సభలు నిర్వహించాలని తెలిపారు.

సంబంధిత బీఎల్‌ఓలు, చునావ్ పాఠశాల సభ్యులు సభల్లో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

గ్రామ సభలు/వార్డు సభల నిర్వహణపై బీఎల్‌ఓల ద్వారా ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. సభల వద్ద ఫారం-6, ఫారం-7, ఫారం-8 తదితర అవసరమైన ఫారాలను సిద్ధంగా ఉంచాలని తెలిపారు.గ్రామ సభ/వార్డు సభలో బీఎల్‌ఓలు డ్రాఫ్ట్ ఓటరు జాబితాలోని ఓటర్ల పేర్లను చదివి వినిపించాలని, జాబితాలో పేరు లేని అర్హత కలిగిన భారతీయ పౌరులను గుర్తించాలని సూచించారు. 01.10.2026 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకునే వారు ఫారం-6తో పాటు డిక్లరేషన్ ఫారం, అవసరమైన ఆధారాలను సమర్పించి ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలని తెలిపారు.

డ్రాఫ్ట్ ఓటరు జాబితాలో పేరు లేదా ఇతర వివరాల్లో తప్పులు, వ్యత్యాసాలు ఉన్నట్లయితే ఫారం-8 ద్వారా సవరణలకు దరఖాస్తు చేసుకునేలా ప్రజలకు వివరించాలని అన్నారు.

అర్హత లేకపోయినా జాబితాలో పేరు నమోదైన వారిని గుర్తించి, అదే నియోజకవర్గానికి చెందిన ఓటరు ఫారం-7 ద్వారా అభ్యంతరం సమర్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

మ్యాపింగ్ కాని, అనామలీస్ గుర్తించిన ఓటర్లందరికీ నోటీసులు జారీ చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశించారు. ప్రతి నోటీసులో విచారణ తేదీ, విచారణ జరిగే ప్రదేశం, సమయాన్ని స్పష్టంగా పేర్కొనాలని తెలిపారు. నోటీసు జారీ చేసిన తేదీకి, విచారణ తేదీకి మధ్య కనీసం 7 రోజుల వ్యవధి ఉండేలా చూడాలని సూచించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ రెండు రోజుల్లో నోటీసులు ఇవ్వడం పూర్తి చేస్తామని పేర్కొన్నారు. గ్రామ సభల విషయంలో తమరు ఇచ్చిన సూచనల మేరకు ప్రణాళిక అబద్ధంగా ఎస్ఐఆర్ ప్రక్రియను నిర్వర్తిస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ లోకల్ బాడీ గణేష్, డిఆర్ఓ విజయలక్ష్మి వరంగల్ నర్సంపేట ఆర్డీవోలు సుమ ఉమారాణిలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story