Gudur: జాలువారిన భీమునిపాదం జలపాతం: పర్యాటకుల సందడి

Gudur: మహబూబాబాద్ జిల్లా గూడూరు పరిధిలోని భీమునిపాదం జలపాతం వర్షాలతో పరవళ్లు తొక్కుతోంది. ఆదివారం సెలవుదినం కావడంతో పర్యాటకులు భారీగా తరలివచ్చారు.

B NARASIMHA, GUDUR
Published on: 13 Sept 2026 5:48 PM IST
Gudur
X

Gudur: జాలువారిన భీమునిపాదం జలపాతం: పర్యాటకుల సందడి

గూడూరు: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో గత రెండు రోజులుగా కురిసిన వర్షాలకు ప్రముఖ పర్యాటక ప్రాంతమైన భిమునీ పాదం (భీమునిపాదం) జలపాతం గలగలపారుతూ మనోహరంగా జాలువారుతోంది. ఆకుపచ్చని అడవుల మధ్య కొండరాళ్ల పైనుంచి నురగలు కక్కుతూ పడుతున్న నీటి ధారలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఆదివారం కావడంతో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పర్యాటకులు భారీగా తరలివచ్చి జలపాతం అందాలను తిలకిస్తూ సేదతీరుతున్నారు.

వర్షాల నేపథ్యంలో జలపాతం వద్ద పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని, నీటిలోకి దిగవద్దని స్థానిక పోలీసులు, అటవీశాఖ అధికారులు హెచ్చరించారు. ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

B NARASIMHA, GUDUR

B NARASIMHA, GUDUR