Hanamkonda: భూముల రీసర్వేను వేగవంతం చేయాలి అదనపు కలెక్టర్ ఎన్. రవి!

Hanamkonda: భీమదేవరపల్లిలో భూముల రీసర్వేను పరిశీలించిన హనుమకొండ అదనపు కలెక్టర్ ఎన్. రవి. రోజుకు 75 ఎకరాల రీసర్వే లక్ష్యాన్ని పూర్తి చేయాలని సర్వేయర్లకు ఆదేశం.

Narender, Staff Reporter  -Warangal
Published on: 3 Sept 2026 8:11 AM IST
Hanamkonda
X

Hanamkonda: భూముల రీసర్వేను వేగవంతం చేయాలి అదనపు కలెక్టర్ ఎన్. రవి!

Hanamkonda: భూముల రీ సర్వేను వేగవంతం చేయాలని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి సర్వేయర్లను ఆదేశించారు.

హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండల కేంద్రంలో భూములు కొలతలు శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న భూముల రీసర్వే ప్రక్రియను జిల్లా అదనపు కలెక్టర్ పరిశీలించారు.

గ్రామంలో ఇప్పటివరకు ఎన్ని ఎకరాల భూమిని రీ సర్వే చేశారని, ప్రతిరోజు ఎంత సర్వే చేస్తున్నారని, ఎన్ని రోవర్లతో సర్వే చేస్తున్నారనే వివరాలను సర్వేయర్లను అడిగి తెలుసుకున్నారు. అక్కడ ఉన్న రైతులతో రీసర్వే జరుగుతున్న తీరును గురించి అదనపు కలెక్టర్ మాట్లాడి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి మాట్లాడుతూ... ప్రతిరోజు సర్వే బృందం 75 ఎకరాల భూమిని రీ సర్వే చేయాలన్నారు. సర్వే బృందాలు భూముల రీ సర్వే కోసం ముందుగానే ప్రణాళిక తయారు చేసుకొని సర్వే చేపట్టాలన్నారు. సర్వేకు సంబంధించి ముందస్తు సమాచారాన్ని రైతులకు అందించాలన్నారు.

ప్రతిరోజు నిర్దేశిత లక్ష్యంతో భూముల రీ సర్వే చేయడం ద్వారా సర్వే ప్రక్రియ త్వరగా పూర్తవుతుందన్నారు.

ఈ కార్యక్రమం లో స్థానిక తహసీల్దార్ రాజేష్, సర్వేయర్లు, జీపీవో , స్థానిక రైతులు పాల్గొన్నారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story