Mahabubabad: నేర నియంత్రణకే నాకాబందీ తనిఖీలు: గార్ల-బయ్యారం సీఐ రవీందర్!

Mahabubabad: గార్ల-బయ్యారం సరిహద్దు సత్యనారాయణపురం ఎక్స్ రోడ్డు వద్ద సీఐ రవీందర్ ఆధ్వర్యంలో నాకాబందీ నిర్వహించి వాహనాలు, అనుమానితులను తనిఖీ చేశారు.

NARASIMHARAO, BAYYARAM
Published on: 11 Aug 2026 8:30 PM IST
Mahabubabad
X

Mahabubabad: నేర నియంత్రణకే నాకాబందీ తనిఖీలు: గార్ల-బయ్యారం సీఐ రవీందర్!

మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా గార్ల _బయ్యారం మండలం సరిహద్దు అయినా సత్యనారాయణపురం X రోడ్డు దగ్గర ఈరోజు SP Dr. శబరిష్ ips ఆదేశానుసారం DSP తిరుపతి రావు సూచనలతో గార్ల _బయ్యారం CI రవీందర్ ,SI లు సాయికుమార్, ప్రశాంత్ వారి సిబ్బందితో కలిసి స నాకా బంధి నిర్వహించారు.

ఆకస్మిక తనికీలు నిర్వహించి అనుమానిత వ్యక్తుల కదలికలు,ద్విచక్ర వాహనాలు, కార్లు,RTC బస్సులను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టి ఫింగర్ ప్రింట్ డివైస్ లతో తనకీలు చేసి, సరైన పత్రాలు లేని వాహనాలు సీజ్ చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు.

ప్రత్యేక డ్రైవ్స్ నిర్వహించి నేర నియంత్రణకు కృషి చేస్తామని గార్ల బయ్యారం CI రవీందర్ తెలియజేశారు.. వాహనదారులకు సైబర్ క్రైమ్, మత్తు పదార్థాల రవాణా పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గార్ల_ బయ్యారం మండలంలో ఉన్న పోలీస్ స్టేషన్ల సిబ్బంది పాల్గొన్నారు.

NARASIMHARAO, BAYYARAM

NARASIMHARAO, BAYYARAM

Next Story