Warangal: వరంగల్ అజం జాహీ మిల్లు కార్మికులకు సుప్రీంకోర్టు కేటాయించిన భూములే ఇవ్వాలి
Warangal: వరంగల్ ఆజాం జాహి మిల్లు భూముల వేలాన్ని రద్దు చేయాలని MVRS అసోసియేషన్ డిమాండ్ చేసింది.
Warangal: వరంగల్ అజం జాహీ మిల్లు కార్మికులకు సుప్రీంకోర్టు కేటాయించిన భూములే ఇవ్వాలి
Warangal: వరంగల్ నగర కేంద్రంలోని "ఓ" సిటీ లో ఉన్నటువంటి ఆజాం జాహి మిల్లు భూముల వేలం పాటను కుడా అధికారులు తక్షణమే రద్దు చేయాలి. అజం జాహీ మిల్లు కార్మికులకు సుప్రీంకోర్టు కేటాయించిన భూములే ఇవ్వాలి - MVRS అసోసియేషన్.
అజం జాహీ మిల్లు కార్మికులకు ప్రత్యామ్నాయంగా రాళ్లు, రప్పల భూములు కేటాయించకుండా, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నిర్దేశించిన సర్వే నంబర్లలోనే ప్లాట్లు కేటాయించాలని అజం జాహీ మిల్స్ మాడిఫైడ్ వాలంటరీ రిటైర్డ్-2002 కార్మికుల అసోసియేషన్ (MVRS) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
రెండు దశాబ్దాలుగా సాగుతున్న న్యాయపోరాటానికి ముగింపు పలికి వృద్ధ కార్మికులకు తక్షణ న్యాయం చేయాలని కోరింది. హన్మకొండ నగరంలోని రాంనగర్ లో గల మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీ నివాసంలో వారిని కలిసి వినతిపత్రం అందించిన కార్మికులు..
ఆజాంజాహి మిల్లు కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి త్వరలో పరిష్కారం చూపించే విధంగా ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. తెలంగాణ హైకోర్టు మరియు సుప్రీంకోర్టు సూచించిన లక్ష్మిపురం పరిధిలోని సర్వే నంబర్లు 61 నుంచి 71, 76తో పాటు ఖిలా వరంగల్ పరిధిలోని 381, 386, 387 సర్వే నంబర్లలోనే కార్మికులకు ప్లాట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.
ప్రత్యామ్నాయంగా అనువుకాని, రాళ్లు రప్పలతో కూడిన భూములను కేటాయించే ప్రయత్నాలను ప్రభుత్వం విరమించుకోవాలని వారు కోరారు. సుమారు రెండు దశాబ్దాలుగా న్యాయం కోసం పోరాడుతున్న వృద్ధ కార్మికుల సమస్యను ప్రభుత్వం మానవతా దృక్పథంతో పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
అలాగే, అజం జాహీ మిల్లు యూనియన్ కార్యాలయాన్ని కూల్చివేసిన బాధ్యులపై కేసులు నమోదు చేయాలని, అదే స్థలంలో కార్మికుల కోసం ప్రత్యేకంగా "కార్మిక భవన్" నిర్మించాలని ఈ సందర్బంగా వారు ప్రభుత్వాన్ని కోరారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా మిల్లు కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే స్పందించి సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయాలని అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు.




