Warangal: వరంగల్ భద్రకాళీ అమ్మవారిని దర్శించుకున్న ఏపీ దేవాదాయ శాఖ అధికారి

Warangal: వరంగల్ భద్రకాళీ అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్, వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత వేర్వేరుగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Narender, Staff Reporter  -Warangal
Published on: 6 Sept 2026 7:22 PM IST
Warangal
X

Warangal: వరంగల్ భద్రకాళీ అమ్మవారిని దర్శించుకున్న ఏపీ దేవాదాయ శాఖ అధికారి

Warangal: వరంగల్ మహానగరంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళీ దేవస్థానమును ఈ రోజు ఉదయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ అడిషనల్ కమీషనర్ శ్రీ చంద్రశేఖర్ ఆజాద్ ఆలయాన్ని నందర్శించారు. ఆలయానికి విచ్చేసిన శ్రీ ఆజాద్ గారికి ఆలయ ఈఓ శ్రీమతి రామల సునీత, ప్రధానార్చకులు శ్రీ భద్రకాళి శేషులు ఘనస్వాగతం పలికారు.

ఈ సందర్భంగా శ్రీ ఆజాద్ గారు ఆలయంలోకి ప్రవేశించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహింపజేశారు. పూజానంతరం ప్రధానార్చకులు శ్రీ భద్రకాళి శేషు మహదాశీర్వచనం నిర్వహించి అమ్మవారి శేషవస్త్రములు బహూకరించి ప్రసాదములు అందజేశారు.

ఈ కార్యక్రమంలో శ్రీ ఆజాద్ వెంట మాజీ కార్యనిర్వహణాధికారులు శ్రీ జ్ఞాన్దేవ్ రెడ్డి, శ్రీ రాజేంద్రం మరియు మేడారం ఈ.ఓ శ్రీ యం. వీరస్వామి, శ్రీ రత్నాకర్ శర్మ తదితరులున్నారు.

అనంతరం వరంగల్ పోలీస్ కమీషనర్ శ్రీమతి శ్వేత గారు కుటుంబ నతమేతంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహింపజేశారు పూజానంతరం సి.పి కుటుంబ సభ్యులకు మహదాశీర్వచనం నిర్వహించి అమ్మవారి శేషవస్త్రములు బహూకరించారు. ఈ రోజు ఆదివారం కూడా కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలు అమ్మవారిని దర్శించుకున్నారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story