Jangaon: పాలకుర్తి పాఠశాల విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నుల పంపిణీ!
Jangaon: జనగామ జిల్లా పాలకుర్తి ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 50 మంది విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు పంపిణీ చేశారు.
Jangaon: పాలకుర్తి పాఠశాల విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నుల పంపిణీ!
జనగామ జిల్లా: పాలకుర్తి మండల కేంద్రంలోని టెంపుల్ కాలనీ ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలల్లో 50 మంది విద్యార్థులకు నోట్ బుక్స్ పెన్నులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అజ్జురి రజిత శ్రీరామ్ ఫైనాన్స్ జన్మదినం సందర్భంగా నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ట్రస్ట్ చైర్మన్ యతిపతి శ్రీకాంత్ మాట్లాడుతూ పాఠశాల దశ నుండే విద్యార్థులు రోజువారీ పనులను నిర్దేశించుకోవాలని,డైరీ రాయడం అలవాటు చేసుకోవాలని సూచించారు. ట్రస్ట్ సభ్యులను ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ,శ్రీ ఇమ్మడి అశోక్ గారు అభినందించారు. కార్యక్రమంలో ట్రస్ట్ కోశాధికారి ఒర్రె కుమారస్వామి, ట్రస్ట్ ప్రతినిధులు రఘుపతి మరియు పాఠశాల ఉపాధ్యాయులు శ్రీనివాస్,సంపత్, అష్రఫ్ సుల్తానా, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.




