Mulugu: ములుగు కలెక్టరేట్ ఎదుట రైతు కూలీ సంఘం భారీ ధర్నా!

Mulugu: వెంకటాపూర్ పరిధిలోని ప్రభుత్వ భూమిని కబ్జాదారుల నుంచి స్వాధీనం చేసుకుని, పేదలకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలని ములుగు కలెక్టరేట్ ఎదుట రైతు కూలీ సంఘం ధర్నా నిర్వహించింది.

PONNALA SWAMY, MULUGU
Published on: 19 Aug 2026 3:45 PM IST
Mulugu
X

Mulugu: ములుగు కలెక్టరేట్ ఎదుట రైతు కూలీ సంఘం భారీ ధర్నా!

ములుగు జిల్లా: వెంకటాపూర్ మండలం లక్ష్మీదేవిపేట పరిధిలోని 105 సర్వేనెంబర్ గల 135ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జాదారుల నుంచి స్వాధీనం చేసుకోవాలని అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ములుగు జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు.

జాతీయ రహదారి మీదుగా భారీ ర్యాలీ నిర్వహించారు. హైకోర్టు, ములుగు జిల్లా కోర్టు తీర్పును అనుసరిస్తూ 253మంది పేదలకు ఇండ్ల స్థలాలు కేటాయించి పట్టాలు జారీ చేయాలని కోరారు.కలెక్టరేట్ లోనికి వెళ్లేందుకు ప్రయత్నించిన వారిని పోలీసులు అడ్డుకున్నారు.

PONNALA SWAMY, MULUGU

PONNALA SWAMY, MULUGU

Next Story