Hanamkonda: ఎస్ఐఆర్ విచారణ ప్రక్రియను పరిశీలించిన అదనపు కలెక్టర్ రవి
Hanamkonda: హనుమకొండ న్యూరాయపుర 78వ పోలింగ్ బూత్‌లో కొనసాగుతున్న ఎస్ఐఆర్ ఓటర్ల విచారణ కేంద్రాన్ని అదనపు కలెక్టర్ ఎన్. రవి మంగళవారం పరిశీలించారు.
Hanamkonda: ఎస్ఐఆర్ విచారణ ప్రక్రియను పరిశీలించిన అదనపు కలెక్టర్ రవి
Hanamkonda: ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ )ప్రక్రియలో భాగంగా హనుమకొండ న్యూరాయపుర లోని 78వ పోలింగ్ కేంద్రంలో నో మ్యాపింగ్, అనామాలీస్ జాబితాలోని ఓటర్ల కోసం ఏర్పాటు చేసిన విచారణ కేంద్రంలో కొనసాగుతున్న విచారణ ప్రక్రియను జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి మంగళవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా అనామాలీస్, మ్యాపింగ్ కాని ఓటర్ల వివరాలు, నోటీసుల జారీ, ఇప్పటి వరకూ ఎంతమంది ఓటర్లు ధ్రువ పత్రాలు సమర్పించారు, ఎన్ని విచారణ చేశారు, ఇంకా ఎన్ని చేయాల్సి ఉందనే వివరాలను ఏఈఆర్వోలు, బీఎల్వోలను అదనపు కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. జాబితాలోని ఓటర్లు సమర్పించిన ధ్రువ పత్రాల విచారణ ప్రక్రియను పరిశీలించారు. విచారణ ప్రక్రియకు హాజరైన ఓటర్లతో అదనపు కలెక్టర్ మాట్లాడారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ఎన్. రవి మాట్లాడుతూ మ్యాపింగ్ కాని, అనామాలీస్ జాబితాలో ఉన్న ఓటర్ల ధ్రువ పత్రాల పరిశీలన ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. జాబితాలో ఉన్న ఓటర్లు సమర్పించిన పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి తుది ఓటర్ల జాబితాలో ఉండేవిధంగా చర్యలు చేపట్టాలన్నారు.
ఈ సందర్భంగా హనుమకొండ ఏఈఆర్వో/తహసీల్దార్ రవీందర్ రెడ్డి, ఏఈఅర్వో నాగరాజు, బీఎల్వో సూపర్వైజర్ కవిత, బీఎల్వోలు పాల్గొన్నారు.




