Mahabubabad: నామాలపాడులో వన మహోత్సవం, 200 మొక్కలు నాటిన విద్యార్థులు!

Mahabubabad: మహబూబాబాద్ జిల్లా నామాలపాడు గ్రామపంచాయతీలో 75వ వన మహోత్సవం ఘనంగా జరిగింది. సర్పంచ్, ఎంపీడీవో ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి 200 మొక్కలు నాటించారు.

NARASIMHARAO, BAYYARAM
Published on: 25 Aug 2026 1:06 PM IST
Mahabubabad
X

Mahabubabad: నామాలపాడులో వన మహోత్సవం, 200 మొక్కలు నాటిన విద్యార్థులు!

Mahabubabad: మహబూబాబాద్ జిల్లా నామాలపాడు గ్రామపంచాయతీలో సర్పంచ్,MPDO ఏకలవ్య విద్యార్థులతో సర్పంచ్ దీప మాట్లాడుతూ ..75 వన మహోత్సవ కార్యక్రమంలో మాస్ ప్లాంటేషన్ గా 200 మొక్కలను నాటించటం జరిగింది అన్నారు,

వన మహోత్సవ కార్యక్రమం ఉద్దేశం రాష్ట్రంలో అడవులు అంతరించిపోవడం వల్ల, వర్షపాతం పరిస్థితులు తగ్గుతున్నాయని లెనినో పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఈ పరిస్తితులవల్ల రైతులు వర్షాలు లేక ఇబ్బందులు పడుతున్నారు,వాతావరణంలో మార్పుల వలన ఆక్సీజన్ తేమ శాతం తగ్గడం వలన ప్రజలకు అంటూ వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంది కనుక వన మహోత్సవ కార్య క్రమంలో చెట్లు నాటడం వలన ఉపయోగాలు ఉంటాయని విద్యార్ధులకు వివరించడం జరిగింది. ...గ్రామపంచాయతీ విధులు,విధానాలు పరిపాలన గురించి వివరించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో MPO నాగరాజు,APO సజన్ స్వరూప్, గ్రామ కార్యదర్శి వెంకటరమణ, ఉప సర్పంచ్, సూర్నపాక సుజాత వెంకన్న, వార్డు నెంబర్ చీమల కృష్ణ, వివో ఏ గగ్గల కృష్ణకుమారి, పిసా మొబ లైజర్ జార సంతోష,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

NARASIMHARAO, BAYYARAM

NARASIMHARAO, BAYYARAM

Next Story