Thorrur: ఇనుప కంచెకు విద్యుత్ ప్రసరించి 7 జీవాలు మృతి!

Thorrur: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం సోమారం గ్రామంలో విద్యుత్ షాక్‌తో ఐదు గొర్లు, రెండు మేకలు మృతి చెందాయి.

B RAVI, THORRUR
Published on: 31 July 2026 10:35 AM IST
Thorrur
X

Thorrur: ఇనుప కంచెకు విద్యుత్ ప్రసరించి 7 జీవాలు మృతి!

Thorrur: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం సోమారం గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై ఐదు గొర్లు, రెండు మేకలు మృతి చెందాయి.

బాధిత రైతు భాషబోయిన నర్సయ్య తెలిపిన వివరాల ప్రకారం, శుక్రవారం తెల్లవారుజామున సుమారు 5 గంటల సమయంలో గొర్లు అరుస్తున్న శబ్దం వినిపించడంతో షెడ్డు వద్దకు వెళ్లి చూడగా గొర్లు, మేకలు మృతి చెంది కనిపించాయి. అనంతరం పరిశీలించగా షెడ్డు చుట్టూ ఏర్పాటు చేసిన ఇనుప కంచెకు ఆనుకుని ఉన్న గొర్లు విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందినట్లు గుర్తించారు.

షెడ్డు పైభాగంలో ఉన్న విద్యుత్ తీగల నుంచి ప్రమాదవశాత్తు ఇనుప కంచెకు విద్యుత్ ప్రవహించడంతో ఈ ఘటన జరిగినట్లు బాధితుడు తెలిపారు.

మృతి చెందిన ఐదు గొర్లు, రెండు మేకల విలువ సుమారు రూ.1 లక్ష వరకు ఉంటుందని, ఈ ప్రమాదంతో తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన నష్టపరిహారం అందించి ఆదుకోవాలని బాధిత రైతు విజ్ఞప్తి చేశారు.

B RAVI, THORRUR

B RAVI, THORRUR

Next Story