Vizianagaram: మజ్జి కుటుంబానికి ఎంపీపీలు దేవదాస్, నిమ్మన దాసు పరామర్శ

Vizianagaram: విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాతృమూర్తి మజ్జి కృష్ణవేణి మృతి పట్ల కంచిలి ఎంపీపీ, సోంపేట ఎంపీపీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

G.RAMBABU, SOMPET
Published on: 18 July 2026 6:46 AM IST
Vizianagaram
X

Vizianagaram: మజ్జి కుటుంబానికి ఎంపీపీలు దేవదాస్, నిమ్మన దాసు పరామర్శ

Vizianagaram: కంచిలి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) మాతృమూర్తి మజ్జి కృష్ణవేణి (84) ఇటీవల పరమపదించిన నేపథ్యంలో కంచిలి మండల పరిషత్ అధ్యక్షుడు పైల దేవదాస్ రెడ్డి, సోంపేట మండల పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ నిమ్మన దాసు శుక్రవారం విజయనగరంలోని మజ్జి శ్రీనివాసరావు నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఈ సందర్భంగా దివంగత కృష్ణవేణి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళు లర్పించారు. అనంతరం మజ్జి శ్రీనివాసరావుతో పాటు కుటుంబ సభ్యులను ఓదార్చి, ఈ తీరని లోటును భరించే మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించారు. దివంగత కృష్ణవేణి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ఈ పరామర్శ కార్యక్రమంలో కంచిలి ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డి, సోంపేట ఎంపీపీ డాక్టర్ నిమ్మన దాసుతో పాటు కొనపల సురేష్, మడ్డు అభి యాదవ్, కోటిని శ్రీనివాస్, శ్రీకాంత్ గౌడో, తలగాన భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు.

G.RAMBABU, SOMPET

G.RAMBABU, SOMPET

Next Story